పుట:February 2020.అమ్మనుడి.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజులకి అండదండలు అందించేవారు.

ముసునూరి రాజులు తమిళనాడు, కేరళ కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కూడా దండయాత్రలు చేసి విజయాలు సాధించినట్టు పురాతన చరిత్రకారులు తెలిపారు. మిగిలిన కమ్మ వంశాల వీరులు కూడా ఈ దండయాత్రలలో పాల్గొని రాజ్యాన్ని విస్తరించారు. భారతావని యోధుడు సామ్రాట్‌ ముసునూరి ప్రోలయ నాయకుడు వరిపాలించిన “రేఖపల్లి"ని సందర్భించటం జరిగింది. ఈ ప్రాంతం తెలుగు ప్రజలకు ఒక్క మక్కా అయోధ్య, జెరూసలేం లాంటిది. ఇక్కడి నుందే ప్రోలయ నాయకుడు స్వాతంత్ర్య సంగ్రామం నడిపించాడు.

శేఖపల్లి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పు, గోదావరి జిల్లాలో ఉంది. ఇది అటవీ ప్రాంతం. టర్కీ దేశానికి చెందిన ఢిల్లీ సుల్తానులయిన తుగ్లక్‌ను ఓడించటం కోసం ప్రోలయ నాయకుడు ఈ ప్రాంతం ఎంచుకోడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ ప్రాంతం పోలవరం ముంపు ప్రాంతంలో ఉంది. అయితే ఈ ప్రాంతం మునిగేది లేనిది ఇక్కడి అధికారులు స్పష్టంగా ఇప్పుదే చెప్పలేమంటున్నారు. ఇతర భారతదేశ హిందూ రాజులు ప్రజలను కాపాడలేక అడవుల్లోకి పారిపోయిన సమయంలో ముసునూరి ప్రోలయ నాయకుడు ఒక్కడే ఢిల్లీ సుల్తానులకు ఎదురు నిలబడి పోరాడాడు. రేఖపల్లి, ప్రజలతో, అధికారులతో చాలా గంటలపాటు చర్చించటం జరిగింది. రేఖపల్లి చరిత్రను వారికి వివరించడం జరిగింది. వారి ప్రాంత చరిత్ర విన్నాక వారు గర్వముతో పొంగిపోయారు. ఈ గ్రామంలో పలు దేవాలయాలను నేను సందర్శించటం జరిగింది. ఇక్కడ ఒక పురాతన మట్టికోట ఆనవాళ్లు ఉన్నాయి. ఈ మట్టికోట ప్రాంతంలో ఒక పురాతన చెట్టు కింద కోటమైసమ్మ అనే ఒక దేవత విగ్రహం ఉంది. అసలు విగ్రహం భూమిలోనే ఉంది అంట. ఆ ప్రాంతంలో ఆరేళ్ళ క్రితం ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేవతను ఆనాటి రాజులు కులదేవతగా పూజించేవారు అంట. ఈ విషయాల మీద పరిశోధనలు మొదలు పెట్టాను. ఓరుగల్లులో మరియు రేఖపల్లిలో ఆనాటి మహా వీరులైన ముసునూరి నాయకుల చరిత్రను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుజాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే స్వాతంత్ర సమరయోధులు నాయకులు

| తెలుగుజాతి పత్రిక జుమ్మనుడి. ఆ ఫిబ్రవరి -2020 |