Jump to content

పుట:February 2020.అమ్మనుడి.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శకలంలా పచ్చగా, కళకళలాడుతూ వుంటుంది.

విహారిగారు తానో మంచి పాఠకుడ్నిని చెప్పుకుంటారు. అందుకే ఆయన తన ముందున్న రచయితల మార్గంలోనే నడుస్తూ తనదైన విలక్షణ పద్దతిని ఆవిష్మరించుకోగలిగారు. చాసో లా కథనంలో పొదుపునే పాటించినా కొన్ని చాసో కథల్లా ఆయన కథలు వ్యాసాలు కాలేదు. కుటుంబరావుగారిలా మధ్యతరగతి బ్రాహ్మణుల జీవితాల గురించే యెక్కువగా రాసినా ఆయన కథలూ, వస్తువులూ, వేటికవి ప్రత్యేకంగా వుంటాయి. బుచ్చిబాబు తనకిష్టమైన కథకుడే అయినా, కథకు కావల్సినంత మేరకే వర్ణనలు పొదుపుగా వాడుకుంటారు. మొదటి వాక్యంతోనే పాఠకుల్ని కథలోకి లాక్కెల్లిపోతారు. చివరి వరకూ వుత్మంఠతతో కథను నడిపిస్తారు. చిన్న కథనూ పెట్ట మెరుపుతోనే ముగిస్తారు. కథ ముగిశాక కూడా పాఠకుడు దాన్ని వెంబడించాలని కోరుకుంటారు.

విహారిగారి కథా ప్రపంచంలోకి అడుగుపెట్టడమంటే, అది సమకాలీన సమాజపు కోణాలన్నింటినీ పరామర్శించడమే అవుతుంది. కథకుడుగా ఆయన చాలా అప్రమత్తంగా వుంటాడు. తన తరువాతి తరాలనూ సానుభూతితో అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తాడు. కొత్త నీరు పాత నీళ్లని తరిమేసే ధర్మం తన తరానికీ తప్పదనీ, తాతనీ బామ్మనీ వృద్ధాశమానికి పంపాక చాలా రిలీఫ్‌గా ఫీలయ్యే తన కొడుకు భవిష్యత్తులో తమపట్ల గూడా అదే రకంగా వ్యవహరించక పోడని గుర్తిస్తాడు. రోగిష్టి తల్లిదండ్రుల్ని దుర్మార్గంగా విడిచిపెట్టి, విదేశాలకెళ్ళిపోయే పిల్లలు, నిస్వార్థంగా ఆ ముసలివాళ్లకు తోడ్పడుతున్న కూలి జనాల చిత్తశుద్ధిని శంకించినప్పుడు -నిరసిస్తాడు. ప్రయాణంలా సాగే జీవితంలో యెదురైన అనుభవాల నుంచీ, పాఠాలు నేర్చుకుని, హాయిగా ముందుకే సాగాలని హెచ్చరిస్తాడు.

అధోజగత్‌ సోదరులనూ, కింది మధ్యతరగతి వాళ్లనూ “డబ్బు” యెంతగా వేధిస్తుందో విహారిగారికి బాగా తెలుసు. అయితే మధ్య తరగతి మనుషుల జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తున్న వ్యాపార సంబంధాల్ని నిరసిస్తున్న కథల్లో గూడా ఆయన మానవ సంబంధాల మాథుర్యాన్ని నొక్కి చెప్పడం మరచిపోరు. యెదిగిన కూతుర్ని రాబందుల భారి నుంచీ తప్పించడం కోసం నానా బాధలు పడే తల్లులూ, పుస్తకాన్ని కొనగలిగే అయిదు రూపాయల కోసం ప్రమాదకరమైన పందెపు బరిలో దిగే కుర్రాళ్ళూ, బతకలేని వుద్యోగం చేసి బాధ పడుతున్న కొడుకును ఆదుకోవడం కోసం బిక్షమెత్తడానికి గూడా సందేహించని ముసలి తండ్రులూ, బతుకు బరువు మోయడానికి యిష్టంలేని పాత రోత పనులలోనే ముడుచుకుపోవడానికి సిద్ధపడే నిర్భాగ్యులూ, కూతుళ్ళకు పెళ్ళి చేయాల్సిన వయస్సులో గూడా నిస్సిగ్గుగా బిడ్డల్ని కనే తండ్రులూ, అవసరం కోసం అంగ వైకల్యం వుండే అమ్మాయిల్ని పెళ్ళాడ్డం తప్ప మరో మార్గం దొరకని నిస్సహాయులూ యీ మధ్య తరగతి విలాపాలూ, విలాసాలూ విహారిగారి సాహిత్య ప్రపంచంలో మనకెదురౌతారు.

అయినా విహారిగారి కథా ప్రపంచంలోకి అడుగుపెట్టడమంటే జీవన సంరంభంలోకి అడుగు పెట్టడమే అవుతుంది. ఆయనకున్న సానుభూతి, సహానుభూతి జీవితాన్నాక వుత్సవ సంఠరంభంగా మారుస్తుంది. రచయితకు జీవితంపైన, ప్రపంచంపైన వుండే గౌరవం,యిష్టం, ఆయన కల్చనా సాహిత్యాన్ని ఆనంద దాయకంగా మారుస్తుంది. చుట్టూ వుండే చీకటిని తిడుతూ కూచోవడం కంటే, చిన్నదైనా వో ప్రమిదెను వెలిగించడమే ఆయనకిష్టం. మనుషుల్లో వుండే మంచితనాల్ని గుర్తించి, వెల్లడించి, ప్రేమించడమే వ్రతంగా బతికే వరమ్మలూ, అవసరం వచ్చినప్పుడు గతమంతా మరిచి ఆదుకునే వదినమ్మలూ, బతుకంతా బాధ్యతల్ని సునాయాసంగా మోసే భద్ర మహిళలు సుభద్రమ్మలూ, భర్త ఆంతర్యాన్ని మంచికే మొగ్గే శ్రీనివాసులూ - వీళ్లంతా తమ మంచితనంతో ముగ్గ్దుల్ని గావించి, జీవితం పట్ల అనురక్తిని రేకెత్తిస్తారు.

విహారిగారిది ధర్మాగ్రహం. పీడనలోంచీ పీడనే పుడుతుందని ఆయన హెచ్చరిస్తారు. భర్త దుర్మార్దానికి వెరచి, యికపైన పీడితుల శాపాల్ని భరించలేనంట్లూ అతగాడు చేసిన పొరబాట్లను సరిదిద్ద పూనుకున్న పార్వతమ్మ పాఠకులకు చెప్పాల్సిన పాఠం స్పష్టంగానే చెప్పేస్తుంది. సమాజంలో యింత దుర్మార్గముండడానికున్న కారణాలను ఆయన కథలన్నీ తరచి చూస్తాయి. యీ లోకాన్ని మరింత అందంగా తయారు చేయడమెలాగో సూచిస్తాయి.

విహారిగారి కథలు రాత్రి వుతికి ఆరేసిన నేత చీరను తెల్లవారుజామున కప్పుకున్నట్లుగా వుంటాయి. లే వెన్నెల్లో కమ్మతెమ్మర వీస్తున్నట్టుగా దగ్గరౌతాయి. కష్టాలనూ, కడగండ్లనూ చూసినప్పుడు ఆగ్రహంతో సూర్యశకలంలా మండిఫోయినా, యిరుసున బెట్టిన కంబెనలా కారిపోయినా, చివరకు వాత్సల్యమే జీవితమై ప్రవహించినట్టుగా సాగుతాయి.


జనవాక్యం

“అమ్మనుడి ' చేస్తున్న సేవకు అభినందనలు

1. స్నాతకోత్తర స్థాయిలో తెలుగు మాధ్యమం ప్రవేశపెట్టాలి. అంతేకాక మెడిసిన్‌, ఇంజనీరింగ్‌, వ్యవసాయశాస్త్రం లాంటి విషయాల్ని తెలుగు మాధ్యమంలో బోధించాలి.

2. అర్ధశాస్త్రం, రాజనీతిశాస్త్రం లాంటి విషయాల్ని స్నాతక స్థాయిలో ఇప్పటికీ కొన్నిచోట్ల తెలుగు మాధ్యమంలో బోధిస్తు న్నారు- విద్యార్థులకు అర్థమయేందుకని. విస్తృతస్థాయిలో ఇది జరగాలి.

3. ఆంగ్లాన్ని ఐచ్చిక విషయంగా బోధించాలి. తప్పనిసరి అంశంగా కాకుండా. ఆంగ్ల మాధ్యమం ఏ స్థాయిలోనూ అందకూడదు.

4 పాలనాభాషగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగే అమలు చేయాలి.

5. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ఉద్యోగాల్లో ప్రత్యేక కేటాయింపు (రిజర్వేషన్‌) ఉండాలి.

- డా॥ తక్యేలు మాచిరెడ్డి, 9666626546