పుట:February 2020.అమ్మనుడి.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

“సాహొత్యరంగర

మధురాంతకం నరేంద్ర 9566243659

రిగారి వసుధిక కుటుంబం

విహారిగారి కథలన్నీ చదివాక, ఆ కథలన్నింటిలోనూ ఆయన వ్యక్తిత్వం, లోక మంతా వ్యాపించిన గాలిలాగా, పరివ్యాప్తమై వుందదం గమనించాక, ప్రత్యేకంగా ఆయన లె వ్యక్తిత్వాన్ని పూర్తిగా, స్పష్టంగా పట్టిచ్చే కథేమిటని (ప్రశ్నించుకుంటే, అందుకు సమా ధానంలా, “వలయం” అనే కథ నా ముందు నిటారుగా నిలబడింది. తనను యొన్నికచేసిన కథల సంపుటికి, విహారిగారు ఆ కథనే మొదటి కథగా తీసుకోవడం వెనక, ఆ కథ తన సాహితీ | జీవనానికి ముందుమాటగానో, భూమికగానో ఆయన భావించినట్టుగా నాకు తోచింది.

కొడుకు జీవితంలో యెదురుదెబ్బలు తగిలినప్పుడల్లా వాడికి తోద్చడడం తండ్రి బాధ్యత. కాడుకు సమస్యల్ని తండ్రి పరిష్కరించడంలో ఆశ్చర్యమేముంటుంది? వ్యక్తిగత (పేమను సామాజిక స్తే (ప్రేమగా పెంపొందించుకోవడంలోనే మనీషి గొప్పతనం ముడిబడి వుంటుంది. “వలయం కథలోని . | కథకుడు దూరపు బంధువుల యిబ్బందులకేగాదు, పరిచితులైన వాళ్ళెవరడిగినా, వాళ్ళకు తోద్చడడం తనకి బాధ్యతగా భావిస్తారు. తన సహాయంవల్ల సుఖపడ్డవాళ్ళు, తనపట్ల కృతజ్ఞతల్ని వెల్లడించబోతే, అందులో తాను చేసిన పనేమీ పెద్దదిగాదని నమ్ముతాడు. అలా కాకుండా, యెవరైనా తాను


కలగదేసుకోతంల్ల నూ గురైతే, తాను తప్పేదైనా చేశానేమోననీ తల్లడిల్లిపోతాడు. యెదుటి మనీషి మనస్సుకు నొప్పి కలగకుండా జాగ్రత్త పదుతూ, అతను అప్పజెప్పిన బాధ్యతను చిరునవ్వుతో, ఆత్మ విమర్శ చేసుకుంటూనే, చేసుకుపోతాడు. యీ బాధ్యతల వలయాల నుంలీ ఆ కథకుడు బయట పడాలని యెప్పుడూ అనుకోడు.

కుటుంబమనే మౌలిక సమాజం నుంచీ, ప్రపంచమనే విస్తృత సమాజం వరత్తూ విహారిగారి సభ్యత్వ స్ప పహ గాధంగా ఆయన కథలన్నింటిలోనూ ప్రతిఫలిస్తూ వుంటుంది. కథకుడుగా ఆయన బాధ్యత గుర్తెరిగిన రచయిత అనీ, ఆ కర్తవ్య నిర్వహణ నుంచీ తప్పుకోవడం ఆయనకు అసాధ్యమనీ చెప్పడానికి అయిదు దశాట్టా లుగా ఆయన నిర్విరామంగా రాస్తున్న రచనలే పెద్ద సాక్ష్యం.

1970-80 ల మధ్యలో ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రప్రభ, యువ, జ్యోతి వంటి పత్రికల్లో మధ్య తరగతికి చెందిన రచయితలే పుంకాను పుంకాలుగా కథలు రాశారు. సహజంగా ఆ రచనల్లో మధ్య తరగతి మనుషుల వుత్ధాన పతనాలే వస్తువులయ్యాయి. వాళ్లం దరిలోనూ యిప్పటి వరకూ ఆపకుండా రాస్తున్న కథకులు విహారి గారొకనే! యెప్పుడూ జన జీవనంలో వొకడుగా మమేకంగావడం, తన అనుభవ పరిధిలోకొచ్చిన విశేషాలనంతా సాహిత్వీకరించడం ఆయన జీవన స్వభావంగా మారిపోయింది.

కథ చెప్పడంలో విహారిగారిది ప్రసన్న కథా కవితార్ధ యుక్తే! ప్రసన్నంగా, స్నేహంగా, ఆర్టంగా, భుజంపైన చెయ్యేసుకుని నడుస్తున్న 'స్నేహితుడు- కథ చెప్పున్నట్టుగా వుంటాయి ఆయన కథలు. మన తాలినాటి కథకులందరిలాగే విహారిగారిది గూడా మౌఖిక ధోరణి. చాలా కథల్లో కథ చెప్పే వ్యక్తి కథలోని పాత్రే అయి వుంటాడు. కొన్నిసార్లు ప్రధాన పాత్రగానూ, మరొకాన్నిసార్లు చిన్న పాత్రగానూ

వుంటాడు. సర్వసాక్షి కథనం వున్న కథల్లో, రచయిత స్వభావం, వ్యక్తిత్వం, కథనంతా తీర్చిదిద్దుతుంది. అలా ఆయన కథలన్నింటి లోనూ పరుచుకున్న విహారిగారి వ్యక్తిత్వం, వలయం” కథలోని కథకుడి స్వభావానికి చాలా దగ్గరగా వుంటుంది. అతను మనుషుల్ని ప్రేమిస్తారు. ప్రకృతినీ, జీవితాన్నీ గౌరవిస్తాడు. తాను సంతోషంగా వుంటూ, తన చుట్టూ వున్న వాళ్లనీ సంతోష పెట్టడమే ధ్యేయంగా జీవిస్తాడు. తన డ్రేమను తన కుటుంబానీకి పంచినంత నిబద్దతతోనే. మొత్తం సమాజానికీ పంచుతాడు. మంచిని గుర్తించి పూజిస్తారు. చెడును (ప్రేమతోనే జయించాలని చూస్తాడు. మధ్య తరగతి పునాదులపైన విస్తరిల్లిన మన దేశపు సౌభాగ్యానికి, మధ్యతరగతి వాళ్ల మానవీయ విలువలే ఆధారమని చాటీిస్తాడు. మధ్యతరగతిలో వుందే కుహనా విలువల్ని వదులుకునే మార్గాల కోసం అన్వేషిస్తాడు. యిదంతా వొక జీవన విధానం. విహారిగారి స్వాభావికమైన యీ జీవన విధానానికి పెరిగిన కొమ్మలూ, ఆకులూ, పువ్వులూ, పళ్లే ఆయన రచనలు.

వ్యక్తిగా సమాజంపైనా, మనుషులపైనా గౌరవమున్నటల్సే, విహారిగారికి సాహిత్యమన్నా, పాఠకులన్నా చాలా గౌరవముంది. పాఠకుడి సమయాన్ని వృథాగానీవ్వడాయన. కథకు అనవసరమనుకున్న అదనపు బరువుల్ని తీసుకురాడు. కథను యెంత చెప్పాలో అంతే చెప్తాడు. వాక వాక్యమైనా, పదమైనా అనవసరమన్నది లేకుందా జాగ్రత్త పదాలనుకుంటాదు. కథకు కావల్సిన కంఠ స్వరాన్నీ శైలినీ సునాయాసంగా అందిపుచ్చుకుంటాడు. కథ ప్రారంభమయ్యాక అది పంచ కళ్యాణి గుర్రంలాగానో, నవ్వుల నదిలో పువ్వుల నావలాగానో, ఠీవిగా చివరి వరకూ సాగిపోయేలా చూస్తాడు. కథనంలో యెక్కడా గతుకులుందవు. ముగింపెవ్చుడూ కథకు కానసాగింపుగానే వుంటుంది గానీ, అతికించినట్టుగా వుండదు. ప్రతికథా వొక జీవన

| తెలుగుజాతి పత్రిక ఇమ్మనుడె ఆ ఫ్ర్రవరి-2020 |