పుట:February 2020.అమ్మనుడి.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ధారావాహిక

జోగిని మంజమ్మ ఆత్మకథ 7

కన్నడ మూలం

డా. చంద్రప్ప సొబటి

అనువాదం

రంగనాథ రామచంద్రరావు

9059779289

(గత సంచిక తరువాయి...)

గురువు చేసిపెట్టిన వంటకాలు తినేదాన్ని !

ఇలాంటి కష్టాల్లో హగరిబొమ్మనహళ్ళి జోగవ్ములతో ఆరునెలలు కాలం గడిపాను.

బతుకుతెరువు కోసం, కడుపు నింపుకోవడం కోసం 'బిక్షమెత్తే" వృత్తిని వదల్లేదు.

ఆ కాలంలో చెరువుగట్టుకు 'అలసందుల' కోతలకు వెళ్ళడం, మా జోగమ్మలకు పెద్ద లాభదాయకమైన విషయం.

అలసందుల కోతల్లో రైతులు వేసిన రాశుల ముందు మా కొంగు చాపితే మాకు కావలసినన్ని అలసందులు తీసుకున్నా రైతులు ఏమీ అనేవాళ్ళు కాదు. అప్పటికాలంలో అలసందులు పన్నెండు రూపాయలకు కె.జి. వచ్చేవి. రైతుల్లో మా పట్ల అంతటి అభిమానం ఉండేది. నమ్మకమూ ఉండేది. అయితే ఇప్పుడు తగ్గింది.

ఒక రోజు మేము ముగ్గురం జోగమ్మలు అలసందుల కోసం తంటబ్రళ్ళికి వెళ్ళాం. కాళవ్వ జోగమ్మ బృందంవారు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళు నన్ను చూశారు. అప్పుడు నాతో ఉన్న జోగమ్మలకు ఏమైందో తెలియదు. నన్ను వదిలి వెళ్ళిపోయారు. దాంతో నేను ఒంటరినయ్యాను. ఆ రోజు చాలా దుఃఖం కలిగింది. నేను తండ్రి, తల్లి, ఇల్లు వదిలి వచ్చిన రోజున కూడా అంత సంకటపడలేదు. ఆ సంకటంతోనే భిక్షాటన చేశాను. తుంగభద్ర నది ఒద్దున తిరిగాను. ఎక్కడ కూర్చున్నా సమాధానం కాలేదు. అలాగని భిక్షం అడగకుండా. ఊరక ఉండటానికి లేదు. అప్పులు పెరిగాయి. భిక్షం ముగించుకుని ఊరికి వెళదామని సాయంకాలం త్రంబళ్ళి బస్ట్రాండుకు వచ్చాను. అక్కడ కాళవ్వ జోగమ్మ, వారి బృందంలోని వాళ్ళు ఉన్నారు.

నేను చాలా అలసిపోయాను.

నాలో దుఃఖం పొంగుకు వస్తోందని నాకు తెలుస్తోంది.

అయితే బలవంతంగా అదిమి పెట్టాను.

అయితే నా బాధ, నా దుఃఖం నా ముఖంలో కనిపిస్తోందని నాకు తెలుసు.

నేను దుఃఖంలో ఉంటే నా ముఖం ఎలా మారిపోతుందో వాళ్ళకూ తెలుసు. అయినా నన్ను పిలవలేదు. అప్పుడు సోమక్క జోగమ్మ, 'ఆ రోజు ఆ నీ మాటలు విని, మనల్ని నమ్మి చిలకనట్టి వదిలి వచ్చేసింది. మనమే ఇలా చేస్తే ఎక్కడికి పోవాలి? అది తెలుసో, తెలియకో తవ్చు చేసింది. ఇప్పుడు ఒంటరిదైంది. మన వెంట పిల్చుకునిపోదాం” అని అందట. అందుకు కాళవ్వ “లేదు, ఆమెకు దెబ్బ పడాలి. బాధలు అనుభవించాలి. కష్టపడితే జీవితం అంటే ఏమిటో తెలుస్తోంది. అప్పుడు పెద్దవాళ్ళు-చిన్నవాళ్ళు, తల్లి-తండ్రి, గురువు అందరు గుర్తువస్తారు. వాళ్ళ గొప్పదనం తెలిసొస్తుంది అని చెప్పి అందరిని పిల్చుకునిపోయిందట. అయితే ఆ రోజు రాత్రి 'సోమక్కా నువ్వు చెప్పిన మాట నేను వినలేదు. మంజమ్మ ఇల్లు చేరిందో లేదో?” అని కాళవ్వ బాధ పడిందట.

(నేను కాళవ్వ బృందంలో మళ్ళీ చేరిన తరువాత ఈ విషయం సోమక్క నాతో చెప్పింది)

ఇలా జరిగిన మరుసటి రోజు హరపనహళ్ళి సంతకు భిక్షానికి వెళ్ళాను. అక్కడ కాళవ్వ జోగమ్మల బృందం కనిపించింది. నన్ను చూసిన కాళవ్వ రమ్మని పిలిచి నాకు బుద్ధి చెప్పింది. అంతేకాకుండా సోమక్క జోగమ్మను నాకు జత చేసి గొల్లరహళ్ళిలో ఇల్లు తీసుకుని అక్కదే మమ్మల్ని ఉంచింది.

ఆ రోజు ఆమె ఆ ఊళ్ళో ఉంచినందుకే ఈ రోజు నాకు ఇల్లు దొరికింది. ఓటింగ్‌ కార్డు దొరికింది. అన్నిటిని మించి ఆమె నన్ను కళాకారిణిగా తీర్చిదిద్దింది. ఈ రోజు నేను ఏదైనా కళాసేవ చేసివుంటే లేదా కళారంగంలో ఏదైనా అభివృద్ధి సాధించివుంటే అదంతా ఆమె ఆశీర్వాదంతో మాత్రమే. ఆమె ఈ రంగంలో కళాసేవ చేసినందుకే నాకు గొప్పగొప్ప అవకాశాలు దొరికాయి. నిజానికి అవి గురువుకు | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫ్ట్చవరి-2020. |