పుట:February 2020.అమ్మనుడి.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆలయం లోపలికి నన్ను తీసుకు వెళ్ళాడు...

పెద్ద ప్రహరీ గోడ...ప్రహరీలోనూ కొన్ని ఆలయాలు ఉన్నాయి. ప్రవేశ మార్గం పళ్శనే ఓ గుడి ఉంది. అందులోకి వెళ్లాం. మూడున్నర మీటర్ల ఎత్తున్న విష్ణుమూర్తి విగ్రహం గర్భగుడిలో కన్పీంచింది....

భారతీయ టూరిస్టులు కొందరు ఆ నీలుచున్న విష్ణుమూర్తి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి హారతులు ఇస్తున్నారు. అందులో ఓ వ్యక్తి తెల్లనీ సిల్కు పంచె కట్టుకుని ఉన్నాడు. సాష్టాంగ నమస్మారాలు చేస్తున్నాడు. విదేశీ యాత్రికులు వారినంతా విచిత్రంగా చూస్తున్నారు.

“భూమ్మీద అతిపెద్ద హిందూ ఆలయంగా ఆంగ్‌కార్‌ వాట్‌ పేరు తెచ్చుకుంది.

12వ శతాబ్దిలో ఈ ఆలయాన్ని సూర్యవర్మ అనే ఖ్మేర్‌ జాతికి చెందిన చక్రవర్తి 6500 ఎకరాలలో నీర్మించాడు.... ఆనాడు ఈ ప్రాంతాన్నంతా యశోధరవురం అని పిలిచేవారు.... కాంబోడియా దేశానికి పెద్ద చిరునామా ఈ ఆలయం. ఈ దేశ జాతీయజెందాలో కూదా ఆంగ్‌కార్‌ వాట్‌ ఆలయ చిహ్నాన్నీ చూడవచ్చు...” ఓ గైడ్‌ టూరిస్టులకు వివరిస్తున్నాడు.

“ఆ ఖ్మేర్‌ చక్రవర్తి పేరు విన్నావా ? సూర్యవర్మ. నీ పేరే ఆయనది కూడా ... మీ తెలుగునేలకు చెందిన విష్ణుకుండినులు... పల్లవులు.... శాలంకాయనులు రాజుల పేర్లు చివరలో వర్మ అనే ఉంటుంది.... వాళ్లలో ఎవరో ఒకరు ఇంత దూరం వచ్చి ఉండాలి.

కాంబోడియాలోనే కాదు వియత్నాంలోని ప్రాచీన రాజ్యమైన చంపా రాజుల పేర్ల చివర కూదా వర్మ అనే ఉంటుంది...కాకపోతే వాళ్లని చామ్‌ జాతీయులని అంటారు. ఖ్మేర్లకు, చామ్‌ లకు అస్సలు పడదు. ఎన్నో సార్లు ఒకరిపై ఒకరు దండయాత్రలు చేసుకున్నారు... వీళ్లిద్దరిపై ఆధిపత్యం సాధించారు ఇండోనేషియాకు చెందిన టశ్రీవిజయ చక్రవర్తులు...” తను పరిశోధించిన విషయాలన్నీ పీటర్‌ చెబు తున్నాడు. నాకు అసలు ఏమీ అర్ధం కావటం లేదు. సాఫ్ట్‌వేర్లో (ప్రోగ్రాములు రాసుకుంటూ ఉందే నన్ను ఈ హిస్టరీ టాపిక్‌ ఎందుకు చుట్టుకుందో ?!

“'ెండో సూర్యవర్మ కంటే ముందు చక్రవర్తులు శివారాధన


చేసేవారు. సూర్యవర్మ వైష్ణవాలయం నిర్మించాడు. ఆ తరువాత ఈ ఆలయం బౌడ్డాలయంగా మారింది. ఆగ్నేయాసియాలో అలనాటి ఖ్మేర్‌... చంపా... రాజ్యాలనీ హిందూ వలస రాజ్యాలనీ అంటారు .. ఇలాంటి హిందూ సంప్రదాయపరమైన ఆలయాలు చంపాలోనూ కన్పిస్తాయి. కానీ భారతీయ నేలల నుంచి ఇక్కడికి వచ్చి వలస రాజ్యాలను స్టాపించారా లేక వ్యాపారాల కోసం వచ్చిన వర్తకులు స్థానికులపై మెరుగైన స్థితిలో ఉండడం వల్ల రాజ్యాలను స్ట్థాపించారా అనేది ఖచ్చితంగా తెలియట్లేదు. తెలుగు రాజులు వాడిన ఇంటి పేరుని వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు... ఆ శిల్చ రీతుల్ని ఇక్కడికి ఎందుకు మోసుకువచ్చారు. ఈ విషయాలు తెలుసుకోవడానికే నేను అమరావతి వెళ్తున్నాను” పీటర్‌ ధోరణి పీటర్‌ ది.

తన మాటలు నాలో ఆలోచనల ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలుగు నేలకు ఇంత దగ్గరగా ఉన్న ఈ రాజ్యాల గురించి మన పాఠ్యపుస్తకాల్లో ఎందుకు చర్చించలేదు...

ఇవన్నీ నాకింతకాలం ఎందుకు తెలియలేదు... అమరావతి... అమరావతి.. అనీ ఎంతో ఆశపడుతున్నాడు. అసలు అక్కడ ఏం మిగిలిందనీ! నాలో నేనే అనుకున్నా.

ఇలా అనేక ఆలోచనల మధ్య విష్ణవాలయం వెనుక భాగం నుంచి మెట్లు దిగి లోపలికి వచ్చాం. ఒక్కసారిగా నా ఆలోచనలు ఆగిపోయాయి. మూడు వందల మీటర్ల దూరంలో మరో ప్రాకారం. మథ్యలో రాళ్ల దారి నిర్మించారు. అటూ ఇటూ కొలనులు.. ఆ ప్రాకారం లోపల ఎన్నో ఆలయ గోపురాలు... అది కేవలం ఆలయం కాదు మరో వ్‌ క ఆలయాలు... ఎన్నో

|తెలగజాకి పత్రిక ఇన్వునుడె జ రాన 2020 |