పుట:February 2020.అమ్మనుడి.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉంది ...” అంటూ బ్యాక్‌ ప్యాక్‌ లోంఛి లాప్టాప్‌ తీసి ఆన్‌ చేసాడు. “ది గ్రేటెస్ట్‌ స్తూప ఆఫ్‌ అమరావతి” అనే పేరుతో దాక్యుమెంటరీ మొదలైంది.

435 అడుగుల చుట్టుకొలత... 100 అదుగుల ఎత్తుగల స్తూపం...20 అడుగుల ఎత్తుతో ప్రదక్షిణపథం....

చుట్టూ నాలుగు వైపులా సింహ ద్వారాలు... పోర్టికోలు ... ప్రదక్షిణపథం చుట్టూ పాలరాతి శిల్చ ఫలకాలు...

ఒకటి కాదు రెందు కాదు....వంపలు ...

పాలరాతి కొండల్లో రాళ్లను తొలిచి...వాటినీ చదును చేసి వలకలుగా కోని... స్కెచ్‌ గీసుకుని... శిల్పాలు చెక్కినట్టుగా చూవిస్తున్నాడు....

బుద్దుడి జీవిత కథలను కొంతమంది నిలుచుని వర్ణిస్తుంటే ... శిల్పులు రాళ్లపై ఆ కథలను చెక్కుతున్నారు..

అమరావతి శిల్చంలో మూడు దశలు....మొదటి రెండు దశల్లో త్రిరత్నాలు...

న్ఫూపం.. . బోధివృక్షం... ధర్మచక్రం... పాదాలు మాత్రమే ఉండేవి. మూడో దశలో ఆచార్య నాగార్జునుడు సర్ధాపాన్ని పునరుద్ధరించి... అభివృద్ధి పరిచి అందమైన శిల్పాలతో ప్రాకారాన్ని తిరిగి నిర్మించాడు.

ఆచార్య నాగార్జునుడి చారవతో మహాయానం రూపు దిద్దు కుంది... బుద్దుడికి రూపం వచ్చింది ... ప్రతి జాతక కథను దృశ్య కావ్యంగా శిల్చంపై రూపుదిద్దారు...ఆ శిల్పాలు నటించాయి... శరీరం ఎన్నీ మలుపులు తిరుగుతుందో అన్ని వంపులూ అమరావతి శిల్పాలలో కనీపిస్తాయి...

మనుషులు... జంతువులు... వస్తువులు... సందర్భాన్ని బట్టి వెనక్కి తిరిగి ఉన్నట్టు చెక్కి వాటిలో ఫోర్త్‌ డైమెన్షన్‌ చూపెట్టారు... అంతేకాదు, ఈ శిల్పాల్లో యానిమేషన్‌ వంటిది కూడా ఉంది...

ఒక్క అంగుళం స్టలం కూడా వదలకుండా శిల్పాలను చెక్కారు...

తెరమీద శిలాఫలకం కదులుతోంది ... బ్యాక్‌గ్రౌండ్‌ లో వివరిస్తున్నాడు పీటర్‌.

“ప్రాచీన భారతంలో గొప్పగా చెప్పే శిల్చరీతులు రెండే రెండు.


| తెలుగుజాతి పత్రిక జువ్మునుడి తి ఫిబ్రవరి -2020


ఒకటి గాంధార శిల్చం, మరొకటి అమరావతి శిల్చం. 2000 ఏళ్ల నాదే తెలుగువాడు సాధించిన ఘన కీర్తి అమరావతి స్టూపం.... భారతదేశంలో అతి పురాతన స్థూపం అశోకుడి కాలం నాటిది సాంచి లో ఉంది. ఆ స్తూపానీకి ఎటువంటి శిల్చ ఫలకాలు లేవు ... తరవాత శాతవాహన కాలంలో ద్వారతోరణాలకు శిల్పాలను చెక్కారు. ఇంచుమించు అదే సమయంలో అంటే రెండవ శతాబ్టీలో అత్యద్భుత శిల్చఫలకాలు వెలిశాయి అమరావతిలో... అంటే 1800 ఏళ్ళ క్రితమే అక్కడ ప్రజలు ఎంతో సృజనాత్మక ఆలోచనలను కలిగి ఉండి ఉండాలి.

లియోనార్జో డావిన్సీ, మైకేలాంజెలోలా వాళ్ల పేర్లు మనకు తెలియదు. వాళ్లు తమ పేరు కన్నా కూదా పనీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆ పనే నేడు అజరామరం అయింది. కాలానికి అతీతమైనది వాళ్ల సృజన....” ముగించాడు పీటర్‌.

నన్ను నేనే మ్రైమరచిపోయాను. గట్టిగా చప్పట్లు కొడుతూ అతడిని కౌగలించుకున్నాను. అమరావతి డాక్యుమెంటరీ అత్యద్భు తంగా ఉందనీ ప్రశంసించాను. “విదేశీ గడ్డపై పుట్టి మా స్టూపం గురించి నువ్వు చేసిన దాంట్లో ఇసుమంతైనా మేం చేయలేక ఫోయాం. అసలు ఇదంతా మా తెలుగునేల మీదే జరిగిందా! నాకు నమ్మబుద్ది కావట్లేదు. అంతటి మహాద్భుతాన్ని ఎందుకు పట్టించుకోకుండా విడిచిపెట్టాం...” అంటూ సంజాయిషీ ఇస్తున్నట్టుగా మాట్లాదాను.

లండన్‌ మ్యూజియంలో మా అమరావతి గ్యాలరీ ఉన్నట్టుగా నాకు తెలియదు.

“నువ్వు విచారపడాల్సిన అంశమే ఇది. కాకపోతే కాస్త ఊరట కలిగించే విషయం చెప్పనా.. అమరావతి శిల్పానికి పొడిగింపుగా ఆంగ్‌కార్‌ వాట్‌ ఆలయ శిల్పాన్ని చెబుతారు. ఇక్కడి గోడలపై ఉన్న శిల్చ ఫలకాల్లో అమరావతి కళ కొట్టొచ్చినట్టుగా కన్పీస్తుంది. అవి వెతుకుతూ, వాటినీ కుంచెలో బంధిస్తూ ఇక్కడ గడుపుతున్నాను” అన్నాడు.

నా మనసు బరువెక్కింది. నేను విజయవాడ లో పుట్టి పెరిగినా అమరావతి శిల్చం గొప్పతనం గురించి-లందన్‌ వాసి నుంచి తెలుసు కోవడం సిగ్దేసింది...చరిత్రను ఒదిలేశామా... అంత గొప్ప శిల్చం గురించి ఇసుమంతైనా మనకెందుకు అవగాహన లేదు. ఎక్కడా అమరావతి శిల్చం కటౌట్లు ఎందుకు కన్పించవు అన్న ఆలోచనలో ఉండిపోయాను.

“నీకు పూర్తిగా అర్ధమయ్యేలా చెబుతా...రా...అంటూ పీటర్‌