పుట:February 2020.అమ్మనుడి.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అర్ధమయ్యేలా చేసేవారు. ఆ మ్యూజియంలోనీ అమరావతి గ్యాలరీ ఖ్‌ నా ఫేవరెట్‌ ప్లేస్‌...ఆ శిల్పాలను చూస్తూ చిత్రించడం నేర్చుకున్నాను. ఆ అఖిరుచే నన్ను హిస్టారికల్‌ ఆర్కిటెక్ట్‌ ను చేసింది.

ఆంగ్‌కార్‌ వాట్‌ 'అప్పర కన్షర్వేజన్‌ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడికి వచ్చాను.”

“ఈ ఆలయం కాంబోడియాలోని ఆంగ్‌కార్‌ వాటొ ఆశ్చర్యంతో గట్టిగా కేకేసినంత పనీ చేశాను.

ప్రపంచంలో అతి పెద్ద హిందూ దేవాలయం ఆంగ్‌కార్‌ వాట్‌ ఇదే అన్నమాట. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి ఈ ఆలయం. అందుకే లక్షల మంది టూరిస్టులు!. నా మనస్సు వేగంగా మరో విషయాన్నీ కూడా (గ్రహించింది. మయన్మార్‌, థాయిలాంత్ల తరవాత నా మజిలీ కాంబోడియా అయిందన్న మాట. ఇక్కడ కూడా తెలుగు జాతీ ఆనవాళ్లు ఏవో ఉన్నాయన్న మాట. అసలు తెలుగు నేలతో అంగ్‌కార్‌ వాట్‌ అలయానికి ఏమిటీ సంబంధం...నా ఆలోచనలకు అడ్డు తగిలాయి పీటర్‌ మాటలు...

“నువ్వు ఆ అద్భుతమైన అమరావతి... అలనాటి ధాన్యకటకం... అదే ధరణికోట.. ఆ అత్యద్భుతమైన నేల మీద పుట్టావు... ఎంత అదృష్టవంతుడివి. నీ గురించి నాకు ఎంతో తెలుసుకోవాలని ఉంది, నాలో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించిన అమరావతి గురించి తెలుసు కోవాలనీ ఉంది...ఎంతో ఉద్వేగంతో ఉన్నా నీజుయితీగా అన్సీం చాయి అతడి మాటలు.

“అమరావతికి 80 కిలోమీటర్ల దూరంలో ఉందే విజయవాడ మా సొంతూరు. చిన్నప్పుడు ఓ శివరాత్రికి ఆ ఊరుకి వెళ్లి అక్కడి అమరలింగేశ్వర స్వామి గుడిలో పూజలు చేశాం. అమరావతి స్తూపం అంటూ మా అమ్మ చూపించింది. అదో పెద్ద మట్టి దిబ్బలా ఉంది. నాకేమీ ఆసక్తి కలగలేదు. ఓసారి హైస్కూల్లో డే టూర్‌కి అమరావతి తీసుకువెళ్లారు. కృష్ణా నది...గుష్‌...చూపిస్తూ మ్యూజియంకి తీసుకు వెళ్లారు. ఈ పాలరాతి శిల్పాలు ఒకప్పుడు అమరావతి స్ట్ఫూపంపై ఉందేవి. కొన్ని వందల సంఖ్యలో. ఇప్పుడు వాటి నకిలీలు మాత్రమే

మిగిలాయి అని అక్కడి గైడ్‌ చెబుతుంటే, మా పిల్లలందరం ఏదో అలా అలా విన్నాం. ఆ రాతి శిల్పాలపై ఎలాంటి ఆసక్తి కలగలేదు. ఆ తరువాత చదువుల్లో మునిగిపోయాను. మేం హైదరాబాద్‌కి వచ్చేశాం. మళ్లీ అమరావతికి ఎప్పుడూ వెళ్ళలేదు.”

“అయ్యో ... నిజమా నువ్వ చాలా దురదృష్టవంకుడివి. మీకు హిస్టరీ పుస్తకాల్లో ఆ మాన్యుమెంట్‌ గొప్పతనం లేదా” అనీ నీరాశతో అడిగాడు పీటర్‌.

“అమరావతి కథలు అని తెలుగులో ఒక పాఠం ఉంది కానీ చరిత్ర పాఠాల్లో అమరావతి గురించి ఎక్కడా లేదు పీటర్‌ ” అంతే నీరాశగా బదులిచ్చాను.

“దక్షిణ భారతదేశంలో అతి పెద్ద బౌద్ద విజ్ఞాన కేంద్రం ధరణికోట. అశోకుడి సమయంలోనే ఇక్కడ స్థూపం ఉందేది. రెందు వేల ఏళ్ల నాడు ఎందరో విదేశీయులు ఇక్కడికి వచ్చి బౌద్ద అధ్యయనం చేశారు. ఈ స్టూపానికి మరమ్మత్తులు చేయడమే కాక అందమైన శిల్చ ఫలకాలతో తీర్చిదిద్దారు ఆచార్య నాగార్జునుడు, ఆయనని రెండో బుద్దుడిగా పేర్కొంటారు. వివిధ దేశాలలో నిత్యం భగవానుడిగా పూజలందుకుంటున్న మహనీయుడు ఆయన. నాగార్జునుడు పుట్టిన నేల నుంచి నువ్వు వచ్చావ్‌. ఆయన గురించి నాకన్నా నీకే ఎక్కువగా తెలియాలే. ” పీటర్‌ ఏవో ఏవో చెబుతున్నాడు.

నాకవన్నీ అర్ధం కావడం లేదు. ఆచార్య నాగార్జునుడి పేరు మాత్రమే తెలుసు. అంతకుమించి ఎక్కువగా తెలియదు.

ోెస్టరీ గురించి మీ దేశంలో పట్టించుకోరా.... మన చరిత్ర తెలిస్తేనే కదా వర్తమానంలో మరిన్ని గొప్ప పనులు చేస్తూ భవిష్యత్తు తరాలవారికి స్ఫూర్తి కలిగించగలం” అన్నాడు.

“మా దేశంలో అలాంటి స్ఫూర్తి తక్కువ. తమ పిల్లలు ఇంజనీర్సో, దాక్టర్లో అవ్వాలని తల్లిదండ్రులు చూస్తారే కానీ, మిగతా సబ్జెక్టుల గురించి పట్టించుకోవడం లేదు.

ఇక హిస్టరీ పేరెత్తితే అస్సలు ఊరుకోరు. నువ్వ చెప్పినట్టుగా ఈ విషయంలో మేం దురదృష్టవంతులమే.” నా స్థితిని పీటర్‌ కు వివరించాను.

'నేను అమరావతి స్తూపం పైన స్పెషలైజేషన్‌ చేశాను. 3డి టెక్నాలజీలో ఈ స్ఫూపాన్ని పునర్నిర్మించాను. దానీకి నాళు యూనివర్సిటీ లో ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. ఆ దాక్యుమెంటకీ నా దగ్గరే


తెలుగుజాతి పత్రిక ఇమ్మనుజి ౨ ఫ్రవరి-2020 |