పుట:February 2020.అమ్మనుడి.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొత్తందం తెస్తుంది. ఈ

సాహిత్యరంగంలో సృజన ఊట అయితే, భాష ఊతం వంటిది. 'భాషు భావ వ్యక్తీకరణకు ఆయుధం వంటిది. అయితే, ఆ భాష మాతృభాష అయితే, భావ వ్యక్తీకరణ నారికేళంలో నీరులాగా స్వచ్చంగా ఉంటుంది. “భాష నే అయుధాన్ని ఎలా, ఎప్పుడు ఉపయోగించాలో ఈ పిల్లలకు బాగా తెలుసు. వారు వ్రాసిన కథల్తో, సందర్భోచితంగా వారు ప్రయోగించిన భాష్వాస్తాలే ఇందుకు సాక్ష్యాలు. ఎక్కడ చక్కని భాషను వాడాలో, ఎక్కడ హత్ళుకు పోయే యాసను వాడాలో వారికి బాగా తెలుసు. అలా రెండింటినీ సమన్వయం చేస్తూ వ్రాసిన కథలెన్నో...

ఆకాశం నుండి భూమి వరకు, అనగనగా నుండి 2090 సంవత్సరం వరకు, రాజు నుండి రైతు వరకు, 'పాణమున్న జంతువుల నుండి కదలలేని బెంబీ వరకు, ప్రకృతి నుండి పగిలిన సీస వక్మల వరకు - ఇలా ఊహకందని వైవిధ్యమైన కథా వస్తువులెన్నో - ఈ కథలకు రంగులద్గమంటే, ఇంధద్రదనన్సు చేతులెత్తేని వెళ్లి పోతుందేమో...! ఊహాశక్తికి రెక్ళలిచ్చిన ఈ బాలలు, వాటితో అనంత దూరాలకు, కొత్త లోకాలకు వెళ్లారు కానీ, పొరపాటున కూదా కృత్రిమ తీరాలకు వెళ్ళలేదు. నేల విడిచి సాము చేయలేదు. సామాజిక స్పృహతో, బాధ్యతతో, మంచి ఉద్దేశ్వాలతో వ్రాసిన ఈ కథలన్నీ చాలా మంచిగా, మండు వేసవిలో వేపచెట్టు గాలంత చల్లగా ముగుస్తాయి. ఉన్నత ఆలోచనల్చి మనసు లోతుల్నీ తాకిన ఈ రచనలు పిల్లల మనసుకి అద్దాలు.

బాలల్మి వారి మనసులోనీ ఆలోచనలను వారే అక్షరాలుగా ఆవిష్కరించే దిశగా వారినీ ప్రోత్సహించి, వారి వికాసమే ధ్యేయంగా గత ముప్పై సంవత్సరాలుగా కృషి చేస్తూ నేడు ఒక గొప్ప ప్రయత్నా నీకి నాంది పలికిన మణికొండ వేదకుమార్‌గారు అభినందనీయులు. వారు చేస్తున్న కృష్ణి పిల్లల వికాసం కోసం ముందడుగు వేస్తున్న వారందరికీ ఆదర్శనీయం.

అక్షరాలై ప్రవహించిన ఈ ఆలోచనల ఏరులు- అలసత్వపు ఎండసోకి -బీడుగా మారిన హృదయ నేలల్లో- తిరిగి చైతన్యపు పచ్చదనాన్ని నింపుతాయని ఆశిస్తున్నాను.

స్పందనను వ్రాయండి

'అమ్మనుడిలో రచనలపై టు స్పందనను వ్రాసి పంపండి! సంపాదకుడు “అమ్మనుడి, జి-2, శ్రీ వాయుపుత్ర రెసిడెన్సీ, హిందీ కళాశాల వీథి, మాచవరం, విజయవాడ-520 004

ఇ-మెయిల్‌ : 86/0/27౧2౧౮6| 8 ర్ర౫2// 00౧


బుతం

మాతృభాషా యేటి నీటిని వాడకుండా నిల్వజేస్తే...

మరపు నాచు ప్రబలి

మనసు నుండి మాయమగుట సత్యం! మక్కువగ చెంతజేరి

నిత్యం దోసిళ్ల త్రాగిన

తేట నీటితో ఉరకలెత్తుతూ

జాతి ఉనికికి జీవమగుట సత్యం!

మాతృభాషా పెరటి మొక్కను పరధ్యాసన బడి వదిలేస్తే... పసిదనానే వదలి

కాలగతిన ఎండిపోవుడ సత్యం!

కర్తవ్యం మరువక

కంచె వేసి, నీరు పోసిన

సంస్కృతీ ఆమ వృక్షమై

అస్తిత్వ ఫలాల నందించుట సత్యం! సత్యమే కాదిది...

అర్వాచీన బుతం!

ఎస్‌. కాళశింవి 90522 16044

భాష

రోజురోజుకు అమ్మభాష ఒరిగిపోతా వున్నది తెలుగు వెలుగు జాతి నుండి తరిగిపోతా వున్నది మాతృభాషా వాదులెంత తపన చెందుతా వున్నా రాజు చూపుకు అక్షరమ్ము కరిగిపోతా వున్నది తెలుగు తనమును చూచి జనులు మెచ్చుకొందురు కీడు తలచిన చాలు వారె నొచ్చుకొందురు సొంతలాథభము యొంచి కొందరు కూలదోసిన తెలుగుపూలను వలచి కుకుల గుచ్చుకొందురు పదవియున్న చోటుకు దోమల్లాగ దూరిపోదురు పెదవిమీద మధువుకు మల్లే ఊరి, చేరిపోదురు ఆశ పూవులాగున పరిమళించగ ఓ పృధ్వీ! ఘనతగొన్న పాదముల చెప్పులవలె మారిపోదురు!!

ఎస్‌. ఆర్‌. పృథ్వి

9989223845


| తెలుగుజాతి పత్రిక ఇమ్మనుడె ఆ ఫ్ర్రవరి-2020 |