పుట:February 2020.అమ్మనుడి.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“పిచ్చుక పిల్ల” డి.శిరీష వ్రాసిన “సమానత్వం " పూర్తిగా సంభాషణలతోనే సాగిన, పూజమంగాదేవి వ్రాసిన 'ఎవరు గొప్ప ' కథలు వేటికవే గొప్పవి. ఐతే ఇవన్నీ ఒక ఎత్తైతే, డి. కళ్యాణి వ్రాసిన 'ప్రతిభ ' కథ మరో ఎత్తు. పిల్లల్ని అర్ధం చేసుకోవడంలో మనమెంత వెనుకబడి వున్నామో, వారి మనసుని అర్ధం చేసుకోవాలంటే మనం ఎంత ఎత్తుకి ఎదగాలో చెప్పే ఈ కథ, ఎందరో తల్లిదండ్రుల ఆలోచనా విధానాన్నీ మారుస్తుందని నా నమ్మకం.


ఒక కథకు మొదలు ఎంత ముఖ్యమో, ముగింపూ అంతే ముఖ్యం. తెలిసిన కథలకు తమదైన కొత్త ముగింపునిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారీ పిల్లలు. అయితే, వాస్తవాలకతీతంగా వెళ్ళి, కృత్రిమతను చొప్పించే ప్రయత్నం చేయలేదు. ఉన్నది ఉన్నట్లు, సమాజంలో జరుగుతున్నది జరుగుతున్నట్లు వ్రాశారు. నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో ఏనాడూ వెనుకడుగేయని వీరు, ఆ నిజాన్ని కథల రూపంలో మన ముందుకు తెచ్చారు. సయ్యద్‌ సలీం వ్రాసిన “ఆదిత్య కథ” ఆ నిజానికి నిలువుటద్దం. “నిజామాబాద్‌ జిల్లా బడి పిల్లల కథలు” లో దర్శనమిచ్చే ఎన్నో కథలు ఈ కోవలోకే వస్తాయి. ఎ.వైష్ణవి వ్రాసిన “అవయవదానం”, యన్‌. స్వాప్నిక వ్రాసిన 'పరిష్కారం ' బి. శరణ్యదేవి వ్రాసిన “చదువు ప్రాముఖ్యత)', ఎన్‌. సాకేత్‌ వ్రాసిన 'విజయమా - నైపుణ్యమా ', కె. చిన్మయి వ్రాసిన 'అన్నం పరబ్రహ్మం ', ఇలాంటి చక్కని కథలెన్నో ఈ పుస్తకంలో కొలువై ఉన్నాయి. బి.శ్రీముఖి వ్రాసిన “కానుక” చదివాక, పిల్లలు కథలు ఎందుకు వ్రాయాలి అనే ప్రశ్నకి చాలా మందికి సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే, ఇటువంటి కథలు పిల్లలు మాత్రమే వ్రాయగలరు.


కలుపుకోవడం, కలిసిపోవడం వీటి లక్షణం. పిల్లల మనసు కూడా అలాంటిదే. ఒక్క చిరునవ్వు నవ్వితే చాలు, ఎదుటివాళ్లను తమ వాళ్లుగా భావిస్తారు. ఎవ్వరి మనసులోతుల్లోకి తొంగి చూడకుండా, అందరినీ సమానంగా ప్రేమిస్తారు, ప్రేమగా తమలో కలుపుకుంటారు. ఆ కలుపుకుపోయే లక్షణమే పిల్లలు వ్రాసిన ఈ కథల్లో కనిపిస్తుంది. ఐదవ తరగతి చదువుతున్న పి.ఎస్‌.ఎస్‌. అక్షిత వ్రాసిన 'జాలి మనసు ' కథ ఈ కోవలోకే వస్తుంది. కమల్‌నాథ్‌ వ్రాసిన 'ఓ అమ్మకధ ', గోదాలిఖిత్‌ కుమార్‌ వ్రాసిన 'రెండు కళ్లు ' నాల్గవ తరగతి చదువుతున్న డి. అదితిజ వ్రాసిన 'మంచి మిత్రులు” - ఇలాంటి చక్మని కథలెన్నో కనీపిస్తాయి, “ఖమ్మం జిల్లా బడి పిల్లల కథలు” కథల సంకలనంలో.


పిల్లల్లో సహజంగా ఉండే గుణాలు, అమాయకత్వం, అల్లరితనం. పైకి ఎంత అల్లరి మాటలు మాట్లాడినా, పిల్లల్లో లోలోన బెరుకు దాగే ఉంటుంది. ఒక్కోసారి ఎంతో ధైర్యంగా మాట్లాడినట్లు కనిపించినా, వారిలో ఉన్న అమాయకత్వం అలాగే, సముద్రంలో అలలాగే ఉంటుంది. అయితే, ఆ అమాయకత్వం చాటున దాగున్న విశాలమైన ఆలోచనలు, ఆ అల్లరితనం వెనుక మన ఊహకందని లోతైన భావనలు ఎన్నో ఉంటాయి.

ఆ భావనలు అక్షర రూపమెత్తి కథలై కదిలాయి “కరీంనగర్‌ జిల్లా బడి పిల్లల కథలు” పుస్తకంలో, పిల్లలు సమాజాన్ని ఎంత బాగా గమనిస్తున్నారో, సమాజహితం కోసం ఎంత తాపత్రయ పడుతున్నారో, వాసరవేణి విజ్ఞశ్రీ వ్రాసిన “సీస వక్కలు, శ్రీ వివేక్‌ వ్రాసిన “మూఢ నమ్మకాలు”, బత్తిని భవాని వ్రాసిన “నీరు” కథలు చదివితే అర్ధమవుతుంది. ఇక మాచర్ల శివాణి వ్రాసిన “భూమి” సహజ ఎరువులు వాడడం వల్ల జరిగే మేలుని చెబితే, నీరటి కీర్తన వ్రాసిన 'రైతన్న ', రైతు గొప్పతనాన్ని చెబుతుంది. ప్రపంచంలో ప్రతి ఒక్క జీవికి బ్రతకడానికి సమాన హక్కు ఉంటుంది” అంటూ డి. లయ వ్రాసిన 'ఎలుక - పిల్లి ', కె. జ్యోతి వ్రాసిన 'అపురూప కానుక ' యం.ప్రతిభ వ్రాసిన 'కష్టం-దాని ఫలితం ' ఇలా ఎన్నెన్నో కథలు మనల్ని చేయి పట్టుకుని మంచి మార్గంలో నడిపిస్తాయి.


రామాయణ మహాకావ్యం మొదలు, పంచతంత్ర కథలు, వేమన పద్యాలు, సుమతీ శతకం ఇలా మన సాహిత్యమంతా నీతినే బోధిస్తుంది. మానవాళిని 'మంచి' వైపు నడిపిస్తుంది. 'మంచి ' అనేది మానవ మనుగడకి ఊతం లాంటిది. అది కనుమరుగై పోయిన రోజున ఈ భువిపైన మన ఉనికి ప్రశ్నార్థకమైపోతుంది. అవును మరి, మంచిని మించినదేముంటుంది? అయితే, ఎనిమివవ తరగతి చదువుతున్న ఆర్‌.రేణుకను అడిగితే, “మంచి” గురించి ఒక మంచి మాట చెబుతుంది. 'మంచి ఉద్దేశ్యంతో చేసిన ఏ పనైనా అభినందింప బడుతుంది” అంటుంది. తను వ్రాసిన 'శుభ్రత విద్య నేర్పుతుంది '. అనే కథలో. స్వచ్చత దిశగా మన దేశం అడుగులేస్తున్న ఈ తరుణంలో, ఇటువంటి కథల అవసరం ఎంతైనా ఉంది. ఈ కథలోని పాత్రలేవీ ఎవ్వరికీ శుభ్రత, స్వచ్చత గురించిన పాఠాలు చెప్పవు. స్వయంగా ఆచరించి చూపిస్తాయి. అలాగే, 'ప్రతీవృత్తి గొప్పదే, వ్యవసాయం మరీ గొప్పది ' అని చక్కని మాటను చెబుతుంది, గుండా చరిత, తను వ్రాసిన 'సాగినం సాయం ' కథలో. ఈ కథ, రైతు ఆవేదనను చూసి చలించి వ్రాసినట్లు ఉంటుంది. కావేరి వ్రాసిన 'స్నేహబంధం' గంట ప్రశాంతి వ్రాసిన 'పశ్చాత్తాపం ', ఎం. కళ్యాణి వ్రాసిన 'తెలివైన ఉమా ' ఇలా ఒక్కో కథ, మనిషిలోని ఒక్కో కోణాన్ని

28

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2020