పుట:February 2020.అమ్మనుడి.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అమ్మనుడుల పండుగ

డా. సిరి

అక్షర స్రవంతి

ఘనీభవించిన హిమనీనదం ఒక్కొక్క నీటి చుక్కగ కదిలి, మేఘాల మేనాపై తరలి వచ్చిన చినుకుల్ని కలుపుకుని, ఏరులుగా మారి, ప్రవాహమై కదిలినట్టు -, దరిచేర్చు దారి తెలియక, మెదడు పొరల్లోనే దాగిపోయిన ఘనమైన ఆలోచనలన్నీ మేఘాలై మనసు గగనాన తేలిపోతున్న భావనలన్నీ కాస్త వెన్ను తట్టగానే, అక్షర చినుకులుగా, తడి నీటి చుక్కలుగా మారి, కథల ఏరుగ ప్రవహిస్తున్నాయి. హోరెత్తిన ఈ ఏరులో, గుండెని తడిసేసే, మనిషి లోని చెడుని కడిగేసే కెరటాలెన్నో - ఒక్కో కెరటం ఒక్కో కథ చెబుతుంది. ఒక్కో కథ పిల్లల అలోచన స్థాయిని, తెలుగు భాషపై వారికున్న ప్రేమని, వారి ఊహాశక్తిని, కల్మషం ఎరుగని వారి స్వచ్చమైన మనసుని, మనముందుంచుతుంది. ఈ కథలు చదువుతుంటే, “అసలు పిల్లలేనా ఇలాంటి గొప్ప కథలు వ్రాసింది- అని అనిపించక మానదు. అవును మరి, మనకు పిల్లలంటే ఆటపాటలే, అల్లరే. మనం చెప్పేది వారికర్థమైతే చాలనుకుంటాం. వారి స్థాయికి దిగి మాట్లాడుతున్నాం అనుకుంటాం. కానీ పిల్లల మనసులో ఎన్ని గొప్ప ఆలోచనలుంటాయో, ఎన్ని లోతైన భావనలుంటాయో, వారి భావోదెగాలూ, వారిలో దాగున్న ప్రతిభ తపన - వీటన్నింటిని అంచనా వేయడంలో మనం చాలా వరకు వెనుకబడే ఉంటాం. కానీ పిల్లల్లో ఏటువంటి భేషజాలు ఉండవు. మనము వారిని గుర్తించలేదన్న కోపమూ ఉండదు. వారు, తాము నవ్వినంత హాయిగా, స్వచ్చంగా తమ భావనలను వ్యక్త పరుస్తుంటారు. అ భావాలకు అక్షరరూపాలేే, పుస్తక సంకలనాలుగా వెలువడిన పది జిల్లాల బడి పిల్లల కథలు. ఒక్కో జిల్లా కథా సంకలనాన్ని పలకరిస్తే, ఎన్నో ముచ్చట్లని మనతో చెబుతాయి. కథలై మనల్ని అల్లుకుంటాయి.

ఏ చెట్టుకి ఆక్సిజన్‌ అనే పదం తెలుసు? కానీ అది నిరంతరాయంగా అందిస్తూనే ఉంటుంది, మన ప్రాణంలో ఆయువై నిలుస్తూనే ఉంటుంది. అటువంటి సహజత్వంతోనే పిల్లలు సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. ఎదురేదీ ఆశించకుండా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి రూపమే, “రంగారెడ్డి జిల్లా బడి పిల్లల కథలు." బోయిని అజయ్‌ వ్రాసిన 'బాలవాక్కు ', ఎన్‌. ప్రవళిక వ్రాసిన 'ధరిత్రి కాలుష్యం ', సి.హెచ్‌. దీక్షిత వ్రాసిన “పొదుపు” తాను పెంచు కున్న గేదె గురించి యజమాని ఆలోచించే తీరు, వారిద్దరికీ ఒకరిపై ఒకరికున్న ప్రేమను తెలుపుతూ, ఎం.డీ. ఇర్ఫాన్‌ వాసిన “రాముడు”, వ్యవసాయం గురించిన ఒక ముఖ్యమైన విషయాన్ని చక్కగా వివరిస్తూ, కె.వరుణిక వ్రాసిన వేపచెట్టు, ఎస్‌. మానస వ్రాసిన 'తల్లిదండ్రుల ప్రేమ ' బి. కల్పన వ్రాసిన 'కుటుంబ విలువలు ', ఇలా ఒక్కో కథ, ఒక్కో అంశాన్ని మన ముందుంచుతుంది.

పిల్లలకి పశు పక్ష్యాదులంటే ఎంతో ప్రేమ. జంతువుల పట్ల మమకారం, ఇష్టం. వాటిని తమ స్నేహితుల్లాగే భావిస్తుంటారు. ఆ ప్రేమను అణువణువునా నింపుకున్న కథలు, “మెదక్‌ జిల్లా బడి పిల్లల కథలు” పుస్తకంలో దర్శనమిస్తాయి. పాలేటి అంకిత వ్రాసిన 'కొతిలో వచ్చిన మార్పు ', ఎం.డి.అఫ్రిన్‌ వ్రాసిన 'యువరాణి జాలి గుణం ' తెలిసిన విషయాన్నే కొత్త కోణంలో ఆవిష్కరించిన బి. మానస వ్రాసిన 'కృతజ్ఞత ', సర్కార్‌ బడి (ప్రభుత్వ పాఠశాల) గొప్పతనం చెప్పే, మమత వ్రాసిన 'తండ్రిమార్చు ', నేత్రదానం ఆవశ్యకతను తెలుపుతూ, కె.భవాని వ్రాసిన 'నేత్ర దానం', సందిల శ్రీలత వ్రాసిన 'స్ఫూర్తి' ని నిజంగానే ప్రతీ మనసులో స్ఫూర్తిని నింపుతాయి.

పిల్లల వెనుకటిలా లేరు. చెప్పిన ప్రతీకథకల్లా ఊ కొట్టే రోజులు పోయాయి. వారి ఆలోచనా విధానం మారింది. విషయాన్ని చూసే తీరు మారింది. “అసలీ కథ ఇలాగే ఎందుకుండాలి? మనలో మార్చు వస్తే, కథలో కూడా మార్పు వస్తుంది” అనే దృక్పథంతో ఆలోచిస్తున్నారు. అందుకే, ఎదుటివారిని బాధపెట్టే ముగింపులను మార్చి, మానవత్వానికి మంచి ఆలోచనకి జై కొడుతూ, తాము విన్న కథలకే కొత్త ముగింపు నిన్తున్నారు. అందుకు ఉదాహరణే, “హైదరాబాద్‌ జిల్లా బడి పిల్లల కథలు” పుస్తకంలో కొలువైన ఎం. ఊర్వసి వ్రాసిన “ఆదర్శం” అనే కథ. రేష్మ వ్రాసిన 'టీ రాము ' కృషితో నాస్తి దుర్భిక్షం అని చెబితే, ఎన్‌. శివకుమార్‌ వ్రాసిన "ఓపెన్‌ చదువు” ప్రభుత్వం నడిపించే ఓపెన్‌ స్కూల్‌ కాలేజీల గురించి చెబుతుంది. బహుశా ఇటువంటి అంశం మీద ఇంత వరకూ ఎవరూ కథ రాసి ఉండక పోవచ్చు. యు. బాల్‌రాజ్‌ వ్రాసిన

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2020

27