పుట:February 2020.అమ్మనుడి.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరుబలపన్నె = దువ్వెన' గుమ్మాలవాడు = మలేరియా వర్శర్‌ '

గుమ్మం వద్ద కాగితం మీద తను వచ్చినట్లు సంతకం పెడతాడు. వాడే ఆకురాత వాడు, మచ్చలు (టీకాలు) వేయువాడు. అతనిని తనిఖీ చేయడానికివచ్చే సూపర్‌వైజర్‌ చేసేపని కనిపించలేదు కాబట్టి వాడికి సొంత పలుకుబడిలో పేరులేదు. సూపులేరు అంటారు. కణుసుమొరకలఎండ = మొరక (చెవి) జన్నెలు (వరుగులు) కణుసు చెవులవలె ఎండిపోతాయి.

ఎర్రగాయరొండి = మామిడికాయను ఎర్రపరిచే (పండానికి ముందు) రోహిణి. (రొండి రోహిణిగా సంస్కృతంలోకి చేరినదా లేక రోహిణి-రొండిగా మారినదా!)

8) శబ్ద పల్లవాలు : కొండపెట్టడం = కొండకు అగ్గిపెట్టడం

పొట్లంపెట్టడం= పొట్లం పెట్టి వండడం. పొట్లంవేయడం

కబురుకట్టడం= టపా తీసుకుపోవడం,

పులిదెంగింది= కర్మ కాలింది.

తులుసూరు పలిగినపుడు= తులుసూరు చిగురించినపుడు, కొన్ని చిగుళ్ళు పగిలినట్లే విచ్చుకుంటాయి.

సామిపిట్టలు వెలిసినపుడు = అవి దేవుని పిట్టలు కాబట్టి అవి కనిపించడం - వెలువడడం.

అడవికి పారడం = రజస్వల కావడం, ఇప్పుడు రజస్వల అయిన కన్యను అడవికి పంపకపోయినా ఈ శబ్బపల్లవం వ్యవహారంలో ఉంది.

చెయ్యులు వార్చుకోవడం= భొజనానికి రమ్మని పిలవడం.

9)జీవన విధానం, సంస్కారంతో పాటు నుడికారం, ఆచారం కూడా మారుతుంది. గోదావరిలో కొత్తలు కలపడం. విశాఖలో వెన్నులు ముంపడం.

10) తద్దిత ప్రత్యయాలు క్రియలో లోపించడం. దొంగతనం చేయడం అని మనము, దొంగసేయడం అని గిరిజను ' ఇల్లు సేయడం, తప్పుచేయడం, గొరవ సేయడం. గొరవతనం అనే స్వతంత్ర ప్రయోగం కూడా ఉన్నది.

వడిసెల, సెలయేరు, సెకపడం, సెలమళ్ళడం.

'సెల= రాయి (ఈసెల సంస్కృతాన శిలగా మారినదా!)

దాయం మూటకూడు : సోపువేట వెళ్లినవారు మునసబుకు ఇచ్చే మాంసంవాటాదాయం (దాయాదులనగా పాలివారు). గ్రామపెద్ద అయిన మునసబు, గ్రామంలో తక్కినవారు ఒకనాడు పాలివారని ఊహించడానికి ఈ దాయం పదం అవకాశం ఇస్తున్నది.

11) తరచుగా వినిపించే పదాలు :

చెల్ల = మొత్తం, పల్లక = మాడక;

పల్లకాయిడి = నోరు మూసుకున్నాడు (వేలో "శిపశీలన” అనగా నిశ్శబ్దం అని హెచ్చరిక)

మోయుమి= తీసికొనిపో, ఏరుకొని = తీసికొని

జల్లివేయడం= పారజల్లడం ' కొండతేలడం= దాటిరావడం

డెక్కడం= తీయడం 'తిన్నమ్మ తినిపోతే తలుపు డెక్కినవాడికి తంటా '

దసులు= తారసపడడం ' తగులు =వెంటపడు, తరుము

దాచిడుకున్నడు= దాచిపెట్టుకున్నాడు

ఈడబెట్టిరమ్మీ = దించిరా, తీసి తెచ్చుకున్నాడు

నెత్తి దూసుకోవడం, పదును పూసుకోడం.

క్రియకు చేసిడి, వచ్చిది ఈ విధంగానే ప్రయోగం.

12) యడాగమం : నయ్యది, మయ్యది” నాది, మాది.

13) జననిరుక్తి : తబిసికొండ = తబిసి చెట్లున్న కొండ.

కాని అక్కడ శ్రీరామరాజు తపస్సు చేయడంవలన తపసుకొండ అయింది. వాలి కొండ ప్రక్క గ్రామంపేరు ఇప్పటికీ వాలగూడెమే. కాని వాలకొండ సంస్కృతీకరణంలో వాలికొండ అయి - ఇది వాలిసుగ్రీవు రాజ్యం - ముక్కుల, మూతులతో తేడా ఉండే ఇది వానరజాతి, ఇలా కథలు పెరిగాయి. ఇది దండకారణ్యంలో కిష్మింధరాజ్యం అనే అనాది భావనలకు ఊడలుదించాయి.

3. వాక్యసంబంధమ్షైన విశేషాలు= కారకపరమైైనవి. ప్రత్వేకంగా పేర్కొనదగినది. “నిన్ను పిలుస్తున్నారు” అనే ప్రమాణభాషా ప్రయోగానికి బదులుగా 'నీకి పిలువడమట' విం ప్రయోగాలు - భావార్థంలో వర్ణకం. ద్వితీయకు షష్టిరావడం నన్నయనాటి ప్రయోగాలు.

4 అర్ధ విపరిణామం= చేవడిబస అనగా నేడు కల్లు బస అని అర్ధం.

వెనుక గ్రామ నౌకరులైన వాల్మీకులు కల్లు అమ్మేవారు. ఆ నౌకరు కచేరీ చావడి బసన ఉండేవాడు కాబట్టి వాడు చేవడు. చివరకు చేవడి బస కల్లు బసగా దిగిపోయింది (అర్ద సంకోచం).

వేట అనగా మనలో సాధారణంగా జంతువుల వేట అని మాత్రమే స్ఫురిన్తుంది. కాని దుంపలవేట, మొయ్యలవేట (చేప, ఎరక, ఎండ్రికల వేట). ఇలా ఆహార సేకరణ పరంగా విస్తృతమైన అర్జంలో వేట అనే పదానికి ప్రయోగం. ఎవరు ముందుగా పట్టుకుంటే, ఎవరు తవ్వితే, అమ్మువేస్తే వారిదే అది అనే వేట నియమాలే వీటన్నిట వర్తిస్తాయి (అర్జవ్వాకోచం).

సాధు ప్రయోగం :

జరిగిపోయిడి = కాలం చేశాడు.

ఉపవాసం తీర్చారు = ఉపవాసం తరువాత భోజనం చేశారు.

కడుపు కదిలింది = బయలుకు వెళ్ళాలి.

సంస్కృతి పరిణామాన్ని వాజ్మయంలో ఇముద్భుకున్న గిరిజనుల ప్రయోగాలను సేకరించి, వాటి జీవశక్తిని ఆకళించు కొన్నప్పుడే మన తెలుగు తనం వృద్ధి చెందుతుంది.

ప్రకృతి - సంస్కృతి మనోమయ ప్రపంచంలో వేదిక వర్గీకరణం

విశ్వప్రపంచాన్ని ప్రకృతి అనీ సంస్కృతి అనీ విభజించ

24

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2020