పుట:February 2020.అమ్మనుడి.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చు. ఈ సంస్కృతిలో కొంతభాగం విశ్చజనీనమైనా,ఒకో సమాజం ఒక్కొవిధంగా తన సంస్కృతిని మలచుకుంటుంది.”

ప్రకృతిలో మానవుని కృషి, సంస్కృతిగా రూపు దిద్దుకుంటుంది. మానవుడు శాస్త్రం ద్వారా ప్రకృతిలోకి ప్రవేశిస్తాడు. ప్రకృతి కళద్వారా మానవునిలోకి ప్రవేశిస్తుంది. మనిషి తన సంకల్పాలను, ఆకాంక్షలను పదాడంబరంతో, అభినయంతో, చిత్రాలతో కళాత్మకంగా వ్యక్తం చేస్తాడు. ఈ కళలలో సాహిత్యానిది ప్రముఖపాత్ర. ప్రతి శాస్త్రానికి ఒక పరిభాష ఉంటుంది. కాలానికి గంటలు, గడియలు" సంగీతానికి సరిగమలు” భూగోళానికి అక్షాంశ, రేఖాంశాలు మొదలుగా గల ఉహాజనిత పరిభాషను ఏర్పరచుకున్నట్లే ప్రకృతిలో అడవి కొండరాజులది. నీరు జలకన్యది. సంస్కృతిలో పంట భాగ్యాలు పాండవులవి అని స్తూలంగా మనసు అధిదేవతలతో, మనోమయ ప్రపంచంలో ఒక వేదికను సంస్కృతి సిద్దం చేసుకుంది. వారికి ఆయా భాషలలో, వాటి మాండలికాలలో వేరు వేరు 'పేర్లుండ వచ్చు. కాని మనో వ్యాపారం ఒక్కటే.

సంస్కృతి - సాహిత్యం - నమ్మకాలు X న్యాయాలు

ఈ వనరులను వాడుకునే ముందు వారికి మొక్కాలి. నివేదించాలి. హెచ్చరించాలి. కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేము. అద్గంలో చందమామను చూపి పసిపిల్లలను బుజ్జగించినట్లు, ఇచ్చిన దానితో తృప్తిపడమని నచ్చచెప్పాలి. భాషలో పదాలు ఆయా వస్తువులను, భావనలను తలపుకు తెస్తున్నట్లే, కర్మకాండలో చెట్టూ, చేమా, వస్తువులు వాటి వాటిలో సామ్య- వైషమ్యాలను బట్టి ఆయా అధిదేవతలకు ప్రతినిధులౌతాయి. ఆయా వస్తువులను సేకరించి, సమర్పించి, ప్రకృతి-సంస్కృతి అంటే కొండరాజులకు-పాండవ రాజులకు మధ్య ఘర్షణ నివారిస్తున్నట్టు చివరకు తాము అంటే పాండవులు గెలిచినట్టు, ద్రవరూపంలో ఉన్న కల్లును కన్యలనుండి తప్పించినట్లు, కవితలల్లి, ఆయా దేవతల వేషాలు వేసుకుని, ఆట పాటలతో సుఖాంతంగా అభినయించి, వారు అనుగ్రహించినట్లుగా విశ్వసిస్తారు. ఈ తతంగం ఆచారంగా, నమ్మకంగా కొనసాగుతుంటుంది. సామ్య వైషమ్యాలను బట్టి విస్తరించే ఈ నమ్మకాల వ్యాప్తిలో అందదుకులను” బీరకాయ పీచు, శాఖా చంక్రమణం, కాకతాళీయం, బాదరాయణ సంబంధం, బోడిగుండుకు మోకాలికి ముడివేయటంగా జానపదులు ఎంచుతూ తగువులు చేసేటప్పుడు బూటకపు చుట్టరికాలుగా తీసిపడేస్తారు.

తూర్పు కనుమలలో అధిక వర్షపాతం, సారవంతమైన మట్టి గల ఉత్తర భాగంలో పోడు వ్యవసాయం ఎక్కువ. దక్షిణాన గల నల్లమలు వర్షచ్చాయా ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడి తెగలు చెంచులకు ఆహార సేకరణ ప్రధాన జీవనాధారం. అందువల్ల పంట భాగ్యాలతో ముడిపడిన పాండవరాజులు వారి తంతులో కనిపించరు. అలాగే దేశ కాలాలతో ముడిపడిన కవిసమయాలు, ఉదాహరణకు చలిదేశాలో warm welcome, pure as wine ఉష్ణ దేశాలైన మనకు నప్పవు.


రేయింబగళ్ళు, క్రూర జంతువులు-సాధుజంతువులు, పచ్చి-పండు, వేడి-చలువ ' పచ్చిది-కాల్చినది

ప్రకృతిలోగల ఈ ద్వంద్వాత్మక వైరుధ్యాన్ని (binary), కుడి-ఎడమ ”శుభం-అశుభం” మంచి -చెడ్డులుగా సంస్కృతి వర్గీకరిస్తుంది.

విధానం, సంకేజాలు, వస్తువులు

కుడి X ఎడమ; శుభం X అశుభం; బొట్టు X వాత; ప్రదక్షిణం X అప్రదక్షిణం; సవ్యం X అపసవ్యం; అక్షతలు(పసుపు) X అక్షతు (తెలుపు) దేవతలు; నల్లనువ్వు (పితృదేవతలు) ; నివ్వాళి X కొంగుపతికడబ్బు ; నేరేడు X పరిమి ; పూజ X చెడువు ; పీనె X పాడె;

చెట్లు జంతువు, దేవతలు

పరిమి- పెతరలు, వేగిస - మావెలి, నేరేడు - భూదేవి, సంకుదేవుడు, జీలుగు - పాండవు, కన్నెజీలుగు - కన్నెలు, అరి పువ్వు కేసరాలు - హనుమంతుపగడ (సత్తెవిత్తనాలు), రెల్లపూలు- గంగాలమ్మ, దేవగుమ్మడి - దేవతలు, మంచిగుమ్మడి - మానవులు, సరితేనె - మల్లమ్మగడ్డ, ఒంటరికణుసు - అడవి రాజులు, పుట్టకూడు - జాంబవంతుడు, రివ్వబెత్తలు - శివసార్లు, చేప, తాబేలు, కప్ప, ఎండ్రిక - జగన్నికలు, తొండ, బల్లి, దొక్కి ముంగిస - గురువులు, అడవి జంతువులు - అడవి గొల్లలు, క్రూర జంతువులు - దానుగుడు, ఆరెమాను - అర్జునుడు, కొండ గొర్రె - రాజుల కోలగాడు, వేంత - పక్షులలో కోలగాడు, తిత్రికపిట్ట - చెడువు ముండ, వేటగుంజి (గుడ్లగూబ) - పక్షులలో రాజు, బింగిరాజు (మైనా) - బ్రాహ్మణుడు, రాచెలుక (శాకాహార అడవిజంతువు) - దానుగుడు , (సాధుస్వరూపం) చెదలు - నందమ్మ, దేవరిపిట్ట (వడ్రంగి) - మంచి శకునం, అన్నుగోగిద్దు (తేనెల తెరవడు) - దుశ్శకునం, ముహూర్తగాడు. - మోర్ధ (పందికొక్కు), దోసం - పండుగ, ప్రకృతి - సంస్కృతి, నిషేధం - అనుమతి, దానుగుడు (అడవి రాజులు) - పాండవ రాజు, అమ్మతల్లి - జాంకరి, మావెలి - గొంతెమ్మ, నందమ్మ, బాసలు - కొత్తలు, ఉడికించడం - వేయించడం, మారుపేర్లు (నిందాస్తుతి) - స్తుతినింద, రూపకం - రూపకం,

నమ్మకాల దొంతరలు :

1. నూలు పోగు నూరు వరహాలు - పన్నెండు రాటల పందిరి చుట్టూ బిళ్ళనూలు చుడతారు, మిడతరూపున వచ్చిన పెతరకు దినకార్యం జరిపిస్తామని నూలుపోగు కడతారు (పెతర)

2. నేరేడు (సంకుమాను) - ఇరికి తొలిరాట, నేరేడు కింద దేవుడు బస శుద్దికోసం నేరేడు మండతో నీళ్లు జల్లుకుంటారు, వధూవరులు నేరేడు బల్లమీద కూర్చుంటారు, నేరేడు కర్రతో పెళ్లికానివారు పలుకర్ర చేయకూడదు.

3. పండుపిల్లికి జీలుగు కల్లు ఇష్టం -పండుపిల్లి, జీలుగ స్నేహితులు, పండుపిల్లి చంపినవాడు చెట్టెక్కితే కల్లు తగ్గిపోతుంది

4 మనుషులను తినేది మావెలి - వేగిస చెట్టు నరికితే ఎర్రగా జిగురు వస్తుంది, వేగిస బొండల మీద బోనం.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2020

25