పుట:February 2020.అమ్మనుడి.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బస్తా - బైత

బస్తరు - బైతరు

సంయుక్తాలు అసంయుక్తాలుగా మారడం.

కుండాడ నుండి ఉప్పునపల్లి గట్టు వరకు (గోదావరి) ఈ రూపాలు వినిపిస్తాయి. తాడేపల్లి ప్రాంతంలో వినిపించేవి సమీకరణ చెందిన ద్విత్వరూపాలు. వత్తను, బత్తా, బత్తరు.

2) ఉనికి ఉచ్చారణ మార్పులు : గిరిజనుల వ్యవహారంలో ప్రమాణభాషకు భిన్నంగా కొన్ని ప్రత్యేక క్షణాలు కనిపిస్తున్నాయి.

ఉదాహరణకు కొన్ని : సాధారణంగా తెలుగు భాషలో ప్రథమాక్షరం మీద ఊనిక ఉంచడం సహజం. దీనికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కొన్ని అధిక లయగల రూపాలు వినిపిస్తున్నాయి.

ఏల - సూత్తువేమో

ఊనికను రెండవ అక్షరంపై మార్చే ప్రయత్నం ప్రచురం.

దిగువవారు గెద్దాడ అంటే కొండరెడ్లు గెడ్డవాడ అంటారు.

అలాగే కుండాడ - కొండవాడ.

ఇలా కాలక్రమంలో కలిసిఫోకుండా ఉండడమేకాక - వారికి ఒక ప్రత్యేకమైన ఊనిక ఉండడం గిరిజన భాషలో ప్రచురం.

సాగరాంద్రంలో వలె పదాల చివర దీర్ఘాలు తీయడం గిరిజనులలో వినిపించదు. ఈ పలుకు తీరులోనే కాక, పదజాలంలో కూడా తెలంగాణం మాండలిక రూపాలని పోలి ఉండడం గమనించ దగిన విశేషం.

తెలుగు భాషకు ప్రాచీన లక్షణమైన అర్జానుస్వార రూపాలను, పూర్ణానుస్వారంతో పలకడం ఇప్పటికీ తమిళనాడు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోనే కాదు గిరిజన వ్యవహారంలోనూ ఉంది.

కోంతి (కోతి), ఆంపు (ఆవు), తాణ్జేపల్లి (తాడేపల్లి), నూరుపూణ్డి (నూరుపూడి) ఇవేగాక తెలుంగు, వెలుంగు, పెండ (పేడ) వంటివి మాత్రమే కొండరెడ్లలో వినిపిస్తాయి.

పదసంబంధిత  : ప్రమాణ వ్యవహారానికి భిన్నంగా కొన్ని ప్రయోగాలు కనిపిస్తున్నాయి. వ్యతిరేకక్తార్ణక రూపాలకు బదులు యకార రూపాలు కనిపిస్తున్నాయి.

Caption text
ధాతువు వ్యతిరేకక్త్వార్థకం గిరిజనులు
ఊడ్చు ఊద్వక ఉడియక
జడుపు జడవక జడియక
విడుచు విడువక విడియక

అనునాసికాంత ధాతువులలో (అను, విను, కను, కొను) కాలప్రత్యయం చేర్చేటప్పుడు మూర్దన్యీకరణం జరుగకుండానే రూపాన్ని సాధించడం.

Caption text
ధాతువు ప్రమాణ భాష గిరిజన భాష
అను అంటాము అంతాము/అంతిమి
తిను తింటాము తింతాము/తింతిమి
కొను కొంటాము కొంతాము/కొంతిమి

| తెలుగుజాతి పత్రిక జవ్పునుడి త ఫిబ్రవరి -2020 |


3) మూర్ధన్యాక్షర రూపాలు తెలుగు భాషకు గల ప్రాచీన లక్షణాల్లో ఒకటి. గిరిజనుల వ్యవహారంలో ఈ క్షణాన్ని నింపుకోవడం కద్దు.

Caption text
ప్రమాణ భాష గిరిజన భాష
తంగేడు టంగుడు
దొకి డొకి
దిప్ప డిప్ప
దాగు డాగు

4. తద్భవాలుగా శబ్బరూపాలు మారేటప్పుడు కొన్ని ఆసక్తికరమైన మార్పులు వినిపిస్తాయి.

Caption text
జాదం జూజం:
ఓగిరం ఓరెం:
ఉహ ఉహ:
కన్యకు గన్నికు: గ న్య న్న
జధి జల్ది: వర్ణచ్యుతి
ఉద్యోగి ఉద్దెగాడు: ద్య ద్దె
కొయ్యలు కయ్యలు: ఇవి అచ్చ తెలుగు పదాలు
లంకెలు లెంకలు: కాని వాని ఉచ్చారణ మారింది

5) పదాదానం : పరిసర భాషలైన ఒరియా, కోదు, కోయభాషల పదాలు చాలా ఈ మాండలికంలో జొరబడ్దాయి.

Caption text
కరవడి: చివరి (విశాఖ)
జుగుడి: చిరుతిండి (విశాఖ)
జువతబాబు: చిన్న నాయన
మోరి: అడ్డాకులతో కుట్టిన కోటు (విశాఖ)
మోర్ద: పందికొక్కు (గోదావరి)
ఘాటు: 15-16 ఏండ్ల కుర్రవాడు (గోదావరి)
సొండ: పెదవు
జియ: యీడువాడు


6) బాంధవ్య పదాలు :

వదినకు పాప. తమ్మ అనగా బావమరది.

మనుమలు చేయడం - పెండ్లికూతురును చేయడం.

7 సమాస నిర్మాణం : కొండసంత మండువ, నూనెకొప్పుల ఫొన్నచిలుక, దిప్పె మక్కలకొరువ, దొప్పసేసలు, కోనేటిపళ్ళేలు, తూరురాయికట్టువ, వేలుబుంగలవేపి, పులిబరుకుడుమానువంపు, కత్తురాళ్ళఘాటి, పండుమక్కలబొట్టె, కిందోకి (కన్నెదోకి) లోతుగడ్డ, కన్నెఘాటు, పోతబూరం, ఆడకట్టు (ఆడమళయాళం) అడవికట్టు, మాయరతం (విమానం), టెంకగిడుగు, తోకగిడుగు” ఉండవిలుబద్ద (ఉండేలు) నారవిలుబద్ద. {{rhతెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి -2020||23}