పుట:February 2020.అమ్మనుడి.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సంప్రదాయం-సాధికారిత

డా! పి. శివరామకృష్ణ “శక్తి " 9441427977

భాషాశాస్త్రజ్ఞులు మధ్య ద్రావిడంలో తెలుగేతర భాషలమీద పనిచేస్తే సాహిత్యవేత్తలు తెలుగు మాండలికం మాట్లాడే తెలుగు తెగలమీద పనిచేశారు. మానవ శాస్త్రవేత్తలు అన్ని తెగలమీద ఎత్నోగ్రాఫ్‌లు తయారుచేసారు. ఈ మూడు విభాగాలలో జరిగిన కృషికి సమగ్రరూపం ఇస్తే తెలుగు భాష ప్రాచీనతతో పాటు, విస్తృతి కూడా వెలుగు చూస్తుంది. మధ్యద్రావిడ భాషల పదసంపదతో కూర్చిన తెలుగు వ్యత్పత్తి పదకోశం తులనాత్మక అధ్యయనాన్ని సుగమం చేస్తుంది.

“ఒక కొత్తభాషను కనుక్కోవటం, దానికి వ్యాకరణం రాయటం, ఒక పద్యం రాసిన దానికన్నా మంచిది" అని తోచి, భద్రిరాజు కృష్ణమూర్తి, తెలుగు భాషకు ఏంతో సేవచేసిన ఉన్నతాధికారి జాన్‌ గ్వీన్‌ ద్వారా లభించిన ప్రభుత్వ సహకారంతో, విశాఖ జిల్లా అరకు లొయలో కొండదొర కుబి భాష మీద పరిశోధన చేసారు. ఈ కుబి మధ్య ద్రావిడ భాషలలో ఒకటి.

మధ్య ద్రావిడ భాషలు

ద్రావిడ భాషా పరివారాన్ని దక్షిణ, మధ్య, ఉత్తర భారతదేశంలో గల మూడు పెద్ద ఉప కుటుంబాలుగా విభజించవచ్చు. మధ్య ద్రావిడంలో పదకొండు భాషలున్నాయి. తెలుగు, ఆదిలాబాదు జిల్లాలో, దానికి పొరుగు రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలలో గోండి (కోయ దీని మాండలికం) నాయకీ కొలామి (కొలామి మాండలికం నాయక్షి); ఛత్తీస్‌ ఘర్ రాష్ట్రంలోని సుకమలో పర్జి ఆంధ్ర, ఒడిసా రాష్ట్రాల సరిహద్దులోని పెంగో, మండ, గదబ (ఒల్లరి, సాలూరు మాండలికాలు), కూయి, కువి భాషల, వాటి మాండలికాలు మొత్తం 24 ఉన్నాయి. ఇవి కాక ఆంధ్రప్రదేశ్‌లో గల సవర, జాతాపు, ఎరుకల తెగలకు వారి భాషలు వారికున్నాయి. ఇరు రాష్ట్రాలలో గల బంజారాలు వేరే భాషా కుటుంబానికి చెందినవారు.

తూర్పు కనుమలు, కొండ భాషలు -మాండలికాలు,

భాషా సాహిత్యాలు

“కొండభాషలకు మాండలికాలు ఎక్కువ " అని భాషావేత్తల

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి -2020

21