పుట:February 2020.అమ్మనుడి.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉద్యమం

దివికుమార్‌9440167891

సృజనాత్మకశక్తులు వికసించేది మాతృభాషలోనే!!

మాతృభాషా మాధ్యమ అవశ్యకతను నొక్కి వక్కాణించాల్చిన పరిస్థితులు దాపురించిన కారణాన మమ్ములను కొందరు ఇంగ్లీషు భాషా ద్వేషులు అనుకుంటున్నారు. అది నూటికి నూట యాబై పాళ్ళు అబద్ధం. ఎవరైనా తమకు సాధ్యమైనన్ని భాషలు నేర్చుకోవడం చాలా మంచిది. అసలు సమస్య ఇతర భాషలు నేర్చుకోవటంలో లేదు. ఎలా నేర్చుకోవాలి అని తెలుసుకోవడంలోనే ఉంది.

ఏ పరాయి భాష అయినా మాతృభాష ద్వారానే సులువుగా, బాగా నేర్వవచ్చు!! ప్రపంచ దేశాలన్నీ పాటిస్తున్న పాటించిన నియమం ఇదే. ఐక్యరాజ్యసమితి పదే పదే వక్కాణిస్తున్న ప్రపంచ దేశాలకు సందేశం ఇస్తున్న భాషా సూత్రం ఇదే. 70 ఏళ్ళ క్రితవు డా॥ సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్‌ నుండి ఇటీవల విడుదలయిన కస్తూరి రంగన్‌ విద్వా కమిషన్‌ వరకు నివేదికలు చెప్పినది కూడా ఇదే!

1964-66ల నాటి కొఠారి విద్వాకమిషన్‌ అయితే, అత్యంత స్పష్టంగా, మాతృభాషా మాధ్యమంలోనే చదువులు అని మాత్రమే కాక అందరికీ ఒకే తరగతి గది లోనే చదువులు అని కూడా నివేదించింది. దానర్థం కలిగినవారి సంతానం -లేనివారి సంతానం, పెద్ద కులాలు-చిన్న కులాలు అనే భేదం లేకుండా అందరూ ఒకే తరగతి గదిలో మాతృభాషలో చదువుకుంటే నూతన తరాలలో పెంసొంద వలసిన జాతీయ సమైక్య భావన, సమగ్రతను సంతరించుకో గలుగుతుందని ఎంతో ఆశతో చెప్పారు. కానీ తరగతిగదులు వేరైన నాటినుండి, విద్యా ప్రైవేటీకరణ పేరుతో రెండు “గ్లాసుల” చదువులు మొదలైన నాటినుండి నూతన తరాలలో, మరీ ముఖ్యంగా ఉన్నత విద్యావంతులలో కుల, మత ప్రాంతీయ విభేదాలు విద్వేషాలు పెచ్చరిల్లిపోవడం అత్యంత నీచరూపాల్లో నేడు చూస్తున్నాం. ఒక మనిషిని ద్వేషించాలన్నా ప్రేమించాలన్నా “కులం” ప్రాతిపదిక కావటం కన్నా నైచ్యం, సాంస్కృతిక పతనం మరి ఏముంది?

దీనంతటికీ ఒక ముఖ్య కారణం మాతృభాషలో, ఒకే తరగతిగదిలో అందరికీ విద్యా లేకపోవటమే!!! ఇంకా స్పష్టంగా చెప్పాలంటే. పై రెండింటిని, 1. మాతృభాషలో విద్య 2. ఒకే తరగతి గదిలో విద్య - లేకుండా చేయడమే!

మాతృభాషలో విద్యా బోధన అన్నది ఒక సెంటి మెంట్‌- అంటే భావోద్వేగాల- సమస్యగా చాలా మంది భావిస్తు న్నారు. అది అంటే మాతృభాషలో విద్యాబోధన శాస్త్రమే కానీ సెంటిమెంట్‌ కాదు. ఒక ఉదాహరణ చెప్తాను.

గ్వాస్‌స్టవ్‌లు వాడుతున్న నేటి కాలంలో మనందరం నీళ్లు కాచుకోవడానికి స్టేలుపాత్రలు వాడుతున్నాం. మనలో ఎక్కువమందిమి చిన్నతనంలో ఫొంత కుండలు వాడిన వాళ్ళమే అయి ఉంటాం. ఇప్పుడు నీళ్లు కాచుకోవడానికి మట్టికుండలు ఎందుకు వాడుకోవడం లేదు? మనందరికీ తెలుసు. మట్టికుండతో అయితే ఎక్కువ గ్యాస్‌ ఖర్చు అవుతుందని. అదే స్టీలు పాత్రలో అయితే తక్కువ గ్యాస్‌ తో సులువుగా పని జరిగిపోతుందనీ!! ఆ సులువుకు మూల కారణం 'సెంటిమెంటు కాదు. శాస్త్రం! ఏమిటది? ఉష్టానికి విద్యుత్‌కి మంచి వాహకాలు చెడ్డ వాహకాలు ఉంటాయి. విద్యుత్తు ఇనుప తీగలనుండి కూడా ప్రవహిస్తుంది. కానీ రాగితీగలువాడితే (వెండి తీగలు అంత కన్నా మంచివి అనుకోండి) తక్కువ నష్టంతోనూ, ఇనుప తీగలు వాడిదే ఎక్కువ నష్టంతోనూ విద్యుత్‌ ప్రసరణ జరుగుతుంది. వాటినే మంచి వాహకాలు చెడ్డ వాహకాలు అంటారు. భాషకూడా ఒక వాహకమే. సజీవ వాహకం కనుక దాని చెడు ఫలితాలు చాలా తీవ్రంగానూ విస్త్రృతంగానూ ఉంటాయి.

తెలిసిన జ్ఞానం ద్వారా తెలియని జ్ఞానాన్ని తెలిసిన భాష ద్వారా తెలియని భాషను నేర్చుకోవడమే శాస్త్రం! తెలుగు భాషకు ఎంతో సేవచేసిన సి.పి.బ్రౌన్‌ తెలుగుభాషని తెలుగుద్వారా నేర్చుకోలేదు. తన మాతృభాషపై ఇంగ్లీష్‌ ద్వారా నేర్చుకున్నాడు. ఆయనే కాదు సాధారణంగా బాగా సులువుగా వేర్వాలంటే ఎవరైనా చేసేది అదే.

తెలుగునాట ఆంగ్గమాధ్యమం చదువులు ముమ్మరంగా మొదలై 40 ఏళ్లు గడిచిపోయింది. సుమారు 17 లేక 18 ఏళ్ళపాటు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుకున్నప్పుటికీ నూటికి తొంబైమంది తప్పులు లేకుండా సెలవుచీటీ కూడా ఆంగ్లంలో రాయలేని పరిస్థితులు న్నాయి. అందుకు విద్యా వ్యవస్థ వైఫల్యం కూడా ఒక కారణం. ఫలితంగా జరిగింది ఏమిటి? గడిచిన 40 ఏళ్లుగా ఇటు తెలుగూ రానీ, అటు ఇంగ్లీషూరాని మూడు తరాలను మనం సృష్టించుకున్నాం. ఈనాడు తెలుగులో కథ, వ్యాసం, నవల లాంటివి రాస్తున్న వారిలో నూటికి 99 మంది తెలుగు మాధ్యమంలో చదివినవారయి ఉంటారు. రచయితలు అంటే తమ ఆలోచనలను అక్షరబద్ధం కావించే సృజనాత్మకజీవులు. ఎవరికైనా ఆలోచనలు ఆంతరంగిక భావ సంఘర్షణలు మాతృభాషలోనే కదా జరిగేది! గడిచిన 40 ఏళ్లుగా ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకున్న తెలుగువారు కోటిన్నర మందికి పైగా ఉంటారు. వారిలో లక్షకొక్కరి నయినా ఆంగ్లంలో రాసే రచయితలను చూపించగలమా? ఎందుకు సాధ్యపదటం లేదు? వారికి తాము చదువుకున్న ఇంగ్లీషు సరిగా రాత, మాతృభాషపై తగినంత పట్టు లభించక విషయ పరిజ్ఞానము, భావ వ్యక్తీకరణ సామర్ధ్యమూ తరిగిపోయినందువల్లే. సారాంశం ఏమిటి? సృజనాత్మక శక్తులు వికసించేది మాతృభాషలోనే!!! సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు లొంగిపోయిన పాలకులకు, వారిని వారి విధానాలను ప్రశ్నించే సొంత ఆలోచనా తత్వంకల తరాలు పెరగ కూడదనే అనుకుంటారు. వారి పాలనా వైఫల్యాలను ప్రశ్నించేవారు పుట్ట కూడదనే అనుకుంటారు. ఇక ఆలోచించుకోవలసింది మనమే. భవిష్యత్తు తరాలను, వారి సృజనాత్మకశక్తినీ పెంపొందించుకుంటామా, విధ్వంసం కావించుకుందామా??

(మాతృభాషా మాధ్యమ వేదిక నిరహణలో 10 జనవరి 2020 నాడు విజయవాడ పుస్తక మహోత్సవ ప్రధాన వేదికపై నిర్వహించిన సభలో జనసాహితి అధ్యక్షుడు దివికుమార్‌ చేసిన ప్రసంగ సారాంశం)

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి -2020

19