పుట:February 2020.అమ్మనుడి.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భవిష్యత్తులో వారి సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. అందరికీ సమాన జీవితకాల అభ్యాసానికి ప్రాధాన్యత ఇచ్చే. ఐరాసవారి కొత్త విశ్వ విద్యా విషయక పత్రంలో, భాషా హక్కులను గౌరవించే విధానం చాలా అవసరమనీ, దానిపట్ల శ్రద్ద అవసరమనీ పునరుద్దాటిస్తున్నారు.

ఐరాసవారు 2016లో విడుదల చేసిన విధాన పత్రం నుండి కొన్ని ముఖ్య సందేశాలు:

1. పిల్లలకు వారికి అర్ధమయ్యే భాషలో బోధించాలి, వారు మాట్లాడని లేదా అర్థంకాని భాషలో విద్యను పొందలేరు.

2. తరగతి గదిలో పిల్లలు మాట్లాడని భాష వాడటం తరచుగా పిల్లల చదువులకు అడ్జుగోడగా తయారవుతుంది. ఇది ముఖ్యంగా పేదరికంలో వున్నవారి విషయంలో ఎక్కువ.

౩. వివిధ స్థానిక భాషలను మాతృభాషలుగా మాట్లాడేవారికి కనీసం ఆరు సంవత్సరాల మాతృభాషా బోధన అవసరం.

4. బహుళ జాతి సమాజాలలో, పాఠశాల వ్యవస్థలో అభివృద్ది పేరున ఆధిపత్య భాషను విధించడం తరచుగా సామాజిక సాంస్కృతిక అసమానతలవంటి విసృత సమస్యలతో ముడిపడి ఉండటంచేత అది మాతృభాషలకు తలనొప్పిగా మారింది. ఐతే ప్రాధమిక విద్యలో ఆధిపత్య భాష పైచేయికారాదు.

5. విద్యా విధానాలు మాతృభాష నేర్చుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను గుర్తించాలి.

6. భాషా వైవిధ్యం విద్యావ్యవస్థలో సవాళ్లను సృష్టిస్తుంది, ముఖ్యంగా ఉపాధ్యాయ నియామకం, పాఠ్యాంశాల అభివ్చద్ది ఇంకా బోధనా సామగ్రిని అందించడం మొదలైనవి. అయినాసరే, తరగతి గదిలో పిల్లలను వారి ఇంటిభాషనుండి దూరం చేయడం తగదు.

ఐరాసవారి విశ్వవ్యాప్త విద్యాశిక్షణా విధాన పత్రంలో ఒకరి స్వంత భాష కాకుండా ఇతర భాషలో బోధించడం పిల్లల చదువు నేర్చుకోవడంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అని పేర్కాంటోంది. చాలావరకూ ముఖ్యంగా పేద దేశాలలో, పెద్ద సంఖ్యలో పిల్లలు వారి ఇండ్లల్లో మాట్లాడని భాషలలో చదువునేర్చుకొంటున్నారు. అలాగే పరీక్షల్లో రాస్తున్నారు. ఇవి పిల్లలకు ముఖ్యంగా చదవడం రాయడం మొదలైన నైపుణ్యాలను త్వరగా సంపాదించడంలో ఆటంకం కలిగిస్తాయి. వారి తల్లిదండ్రులకు అక్షరాస్యతా నైపుణ్యాలు గానీ పాఠశాలలో ఉపయోగించే అధికారిక భాషలతో పరిచయం గానీ లేనప్పుడు ఇవి తప్పనిసరి ప్రతికూల ఫలితాలనే ఇస్తాయి. ఇలాంటి ఆధిపత్య భాష మాధ్యమ విద్య అల్పసంఖ్యాక ఇంకా బహుళసంఖ్యాక భాషా సమూహాల మధ్య చదువుకొనే అవకాశాలలో అంతరాలను బలోపేతం చేస్తాయి. ఇంటిభాష బడిభాషలు వేరుగా ఉన్నప్పుడు పరీక్షల ఫలితాలు (ఉదా. 30-32% మార్కుల తేడాతో) తలకిందు అయే అవకాశం ఎక్కువగా ఉంటోందని అంతర్జాతీయంగానూ ఇంకా 'ప్రాంతీయంగానూ నిర్వహించిన మూల్యాంకన అంచనాలు నిర్ధారిస్తు న్నాయి. విశ్వవ్యాప్త విద్యాశిక్షణా విధాన పత్రం ప్రపంచ వ్యాప్తంగా విద్యలో అసమానతల

సమాచారం (1౫౦౬) కూడా పిల్లలు ఇంట్లో తరగతిగదిలో వాడేభాష మాట్లాడుతున్నారా లేదా అనే దానిపై ఆధారపడి వుంటుంది అని సూచిస్తోంది.

ఇంటి భాషను బోధనా భాషగా ఉపయోగించడం సర్వత్రా చదువునేర్చుకోవడంపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది అని ఐరాసవారి విశ్వవ్యాప్త విద్వాశిక్షణా విధాన పత్రంలో పేర్కొన్నారు. ప్రతి సంస్థ సురక్షితమైన తాగునీరు, విద్యుత్తు, వేరుగాఉన్న మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా చూడగలగటం, తగినంత సురక్షితమైన తరగతి గదులు తగిన అభ్యాస సామగ్రి సాంకేతికత అందుబాటులో ఉండాలి. అయితే అక్షరాస్యత, లెక్కలలో నైపుణ్యాలు మొదలైనవాటిని పిల్లలకు అర్ధమయ్యే భాషలో పాఠశాలల్లో నేర్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి.

మాతృభాషా బొధనకు నంబంధించి - తక్కువ వనరులు ఉన్నచోట ఎనిమిది సంవత్సరాలకు పెంచడం - మైనారిటీ భాష మాట్లాడేవారికి తరువాతి తరగతులలో మెరుగైన అభ్యాసాన్ని కొనసాగించడానికీ నేర్చుకొనడంలో అంతరాలను తగ్గించడానికి అవసరం (హ్యూ ఇంకా ఇతరులు, 2007 ఐరాస, 2011) అని పేర్కొంటోంది. అలాగే, మాతృభాషలో నేర్చుకునే ప్రాథమిక పాఠశాల పిల్లలు ఇంగ్లీషు మాధ్యమ పాఠశాలలో చదువుకొనే విద్యార్థుల కంటే గణితం, జీవశాస్త్రం, రసాయన శాస్త్రం ఇంకా భౌతిక శాస్త్రంలో 8వ తరగతిలో మెరుగ్గా రాణించారు (హ్వాూ మరియు ఇతరులు, 2007) అని చెబుతోంది. ఇలా ఉదహరించుకొంటూపోతే, విద్యా విధానాలలో “భాష " చాలావరకు అనేక ఇబ్బందులకు మూలంగా ఉంటోంది అని తెలుస్తోంది.

అంతర్గతంగా ఉన్న సామాజిక హెచ్చుతగ్గులూ రాజకీయ కక్షలూ కార్పణ్యాలూ ఏమైనప్పటికీ, ఈ కింది సందర్భాలలో విద్యలో భాషా విధానం హింసాత్మక సంఘర్షణకు కేంద్ర బిందువుగా మారి ఆ తేడాలను ఎత్తిచూపుతోంది. బహుళ జాతి దేశాలలో, ఉదాహరణకు, పాఠశాలల్లో బోధనా భాషగా నిర్బంధ ఆధిపత్య భాషను విధించడం, అది అవసరార్థం అని సమర్థించుకోవడం, సామాజిక సాంస్కృతిక అసమానతల సమస్యలతో సతమతమవుతున్న దేశాలకు మరింత తలనొప్పికి మూలం అవుతున్నాయి. సమాజంలో ఉన్న అసమానత లకు తోడుగా విద్యలో భాషా విధానాలు సృష్టించే తేడాలు తరచుగా హింసాత్మక సంఘర్షణలకు దారి తీస్తూ వాటిని తీవ్రతరం చేస్తున్నాయి. భాషా వివాదాలు తరచుగా ఆధిపత్య, పరాధీన ఇంకా కొన్ని సందర్భాల్లో, పాత వలసవాదానికి తెరలేపే విధానాలను ప్రతిబింబిస్తున్నాయి.

జాతీయ విద్యా విధానాలు పిల్లలకు వారి ఇంటి భాషలో బోధించే ప్రాముఖ్యతను గుర్తించాలి. చాలావరకు విద్యా విధానాలు భాషా వైవిధ్యాన్ని అరుదుగా ప్రతిబింబిస్తాయి. 40 పైగా దేశాల విద్యా ప్రణాళికలను సమీక్షించగా, వాటిలో సగం కంటే తక్కువ దేశాలు మాత్రమే తమ ఇంటి భాషలో, ముఖ్యంగా ప్రారంభ తరగతులలో పిల్లలకు బోధించే ప్రాముఖ్యతను గుర్తించారని కనుగొన్నారు. అయితే ప్రధాన కారణాలు మాత్రం పేదరికం, గతకాలపు వలసవాద విధానాలూను. వాటినుంచి బైటపడటానికి 'మాతృభాషా మాధ్యమాన్ని 'ప్రపంచీకరణ చేయక తప్పదని ఐరాస నివేదికలు సూచిస్తున్నాయి.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి -2020

13