పుట:February 2020.అమ్మనుడి.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అమ్మనుడుల పండుగ ఫిబ్రవరి 21

ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు 9866128846

స్థానిక భాషలే అభివృద్ధికి, శాంతిభద్రతలకూ సయోధ్యకూ మూలం

2020 సంవత్సరంలో, ఐరాస, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా "స్థానిక భాషలే అభివృద్ధికీ, శాంతిభద్రతలకూ సయోధ్యకూ మూలం” అనే ఏకవాక్యాన్ని ప్రధానాంశంగా స్వీకరించింది.

1952 ఫిబ్రవరి 21 న అప్పటి అవిభక్త పాకిస్థాన్‌ తూర్పు పాకిస్తాన్లో అమలు చేస్తున్న ఉర్లూ ఆధిపత్యానికి నిరసనగా బెంగాలీలు చేపట్టిన మాతృభాషోద్యమ పోరాటంలో పాకిస్తాన్‌ జరిపిన హత్యా కాండలో ప్రాణాలు కోల్పోయినవారి స్మృతికి గుర్తింపుగా ప్రతియేటా ఫిబ్రవరి 21న ప్రపంచ దేశాలు అన్నీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని 1999లో ఐరాస సూచించింది. 2000 సంవత్సరంలో మొదలై ఇప్పటివరకూ 20 మాతృభాషా దినోత్సవాలను జరుపుకున్నాం. వీటన్నిటికీ మూలం మాతృభాషలో ప్రాథమిక విద్య, తెలిసిన భాషలో చదువు, భాషావైవిధ్యం - మానవ మనుగడకు అనివార్యం అనే విషయాలే.

ఐరాస భాషా వైవిధ్యం పట్ల తన నిబద్ధతను పునరుద్దాటిస్తూ, స్థిరమైన అభివృద్ధికి భాషా వైవిధ్యమూ పలుభాషల వాడకమూ అవసరమని గుర్తుచేసే విధంగా ప్రతి యేటా ఫిబ్రవరి 21 న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని వీలైనన్ని భాషలలో జరుపుకోవాలని సభ్య దేశాలను కోరుతోంది.

“యునెస్కో " డైరెక్టర్‌ జనరల్‌ ఆడ్రీ అజౌలే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందేశంలో ఇలా అన్నారు:

భాష ప్రసార సాధనం మాత్రమే కాదు, ఇది మనలో మిగిలిన మానవతా విలువలకూ, నమ్మకాలకూ ఇంకా మన ఉనికికి గుర్తింవు నిచ్చే వ్యవస్థ. భాష ద్వారానే మనం మన అనుభవాలను పంచు కుంటాం, అనూచానంగా వస్తున్న నంప్రదాయాలను కింది తరాలకు అందిస్తాం, వేల యేండ్రగా సంపాదించిన జ్ఞానాన్ని యువతరానికి ప్రసారం చేస్తాం. భాషావైవిధ్యం విశ్చవ్వాస్తంగా ఉన్న మానవ జీవన శైలిలో ఉన్న అమిత వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది.

విద్యలో మాతృభాషకు ప్రాముఖ్యత:

ప్రస్తుతం, ప్రపంచీకరణ పేరుతో రోజురోజుకూ కనుమరుగవుకున్న భాషలు ఎక్కువ అవుతున్నందున భాషా వైవిధ్యానికి ఎక్కువగా ముప్పు ఫొంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 43 శాతం మందికి వారి మాతృభాష లేదా వారు అర్థం చేసుకునే స్థానిక భాషలో విద్యను పొందలేకపోతున్నారు. కారణం, భాషలపట్ల అవగాహన కొరవడినవారి చేత అమలుచేస్తున్న భాషా ప్రణాళికలే. ఏదేమైనా, మాతృభాష ఆధారిత బహుభాషా విద్యలో దాని 'ప్రాముఖ్యతపై పెరుగుతున్న అవగాహనతో, ముఖ్యంగా ప్రారంభ పాఠశాల విద్యలో, ప్రజా జీవితంలో మాతృభాష అభివృద్దికి మరింత నిబద్దతతో పురోగతి సాధించాలి.

2020 సంవత్సరంలో, ఐరాస అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ ప్రధానాంశంగా “స్థానిక భాషలే అభివృద్ధికీ, శాంతిభద్రతలకూ సయోధ్యకూ మూలం” అని ప్రకటించి ప్రచారం మొదలెట్టింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ముఖ్యోద్దేశం, ప్రతి దేశం, ఆ దేశంలోని “మాతృభాషలను పరిరక్షించడం, అన్ని అల్పసంఖ్యాక వర్ణాలవారి భాషలకూ రక్షణ కల్పించడం.

ఇందులో భాగంగానే “మాతృభాషలలో విద్య మానవ జీవితాలను మార్చివేస్తుంది” అనే విషయమే ఐరాసవారి ప్రధాన ఆశయ సాధనంగా ఉంది. ఐరాసవారి వ్యూహంలో, ఇది పేదరికాన్ని పారద్రొలి బతుకుబాటను అభివృద్ధి దిశగా నడిపించే సాధనంగా ఉంటుందనేది నిర్వివాదాంశం. ఇదే విషయాన్ని విద్య ౭030 విధానచర్య.

మాతృభాష ద్వారా విద్య సృజనాత్మకతను 'పెంపొందిస్తుంది సమాజంలో అసమాన ఆర్ధిక అస్థిరతతో దెబ్బతిని అనూహ్య మార్పులకు లోనైన జాతులకు, భాషా వారసత్వ గుర్తింపు సమైక్యతకు ఆధారంగా ఉంటుంది. దీనిద్వారా వచ్చిన సృజనాత్మకతే సంఘటిత, సమగ్ర బహుళ సమాజాలను నిర్మించడానికి దోహదం చేస్తుంది. వారసత్వం మరియు సృజనాత్మకత రెండూ శక్తిమంతమైన, వినూత్న సంపన్న జ్ఞాన సమాజాలకు పునాదులు వేస్తాయి.

బలమైన సాంస్కృతిక భాగస్వామ్యం లేకుండా ఎటువంటి అభివృద్ధీ స్థిరంగా ఉండదని ఐరాస నమ్ముతోంది. వివిధ జాతుల సంస్కృతుల మథ్య పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో సాగే చర్చల ఆధారంగా జరిగే అభివృద్ధికి మానవీయ కోణంతో సాగే విధానం మాత్రమే శాశ్వత, సమగ్ర సమాన ఫలితాలకు దారి తీస్తుంది. ఐతే, ఇప్పటి వరకూ, అఖివృద్ధి ప్రణాళికలలో సంస్కృతికి తగినంత ప్రాధాన్యం లభించలేదు. కారణం, మాతృభాషల ప్రాధాన్యం గత కొద్ది కాలంగా తగ్గుతూ రావడమే. మాతృభాషలే సంస్కృతికి 'సేతువులు.

మీరు అర్థంకాని భాషలో ఎలా నేర్చుకొంటారు?

ఇంట్లో మాట్లాడే భాషలోనే నాణ్యమైన విద్యను అందించాలి. అయితే, ప్రస్తుత ప్రపంచంలో కోట్లాదిమంది ఈ కనీస అవకాశాన్ని పొందలేకపోతున్నారు. ఐతే ఇలా పరభాష ద్వారా సాగే చదువు

12

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2020