పుట:February 2020.అమ్మనుడి.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆం(ధ్రప్రదేళ్‌ హైకోర్టు వ్యాఖ్య

“ఇంగ్లీష్‌ మీడియం” లో నిర్చంధించలేం

అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ నిర్భంధంగా ఇంగ్లీష్‌ మీడియాన్ని అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అమలుపై హైకోర్టు తీవ వ్యాఖ్యలు చేసింది. ఇంగ్లీష్‌ మీడియంలోనే చదువుకోవాలని విద్యార్థులను నిర్చంధించలేమని, అలా చేయడమంటే సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్దంగా వ్యవహరించడమేనని స్పష్టం చేసింది. ఇంగ్లీష్‌ మీడియం అమలుకోసం పాఠ్యపుస్తకాల ముద్రణ, శిక్షణా తరగతుల నిర్వహణకు పాల్పడే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ వ్యవహారంలో అధికారులు ముందడుగు వేస్తే...ఆ ఖర్చును వారి నుంచే రాబడతామని పునరుద్దాటించింది. అవసరమైతే ఏసీబీ, సిబీఐ విచారణకు ఆదేశించి డబ్బును వెనక్కి రప్పిస్తామని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్‌లను. ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయనీ పక్షంలో పాఠశాల విద్వాశాఖ ముఖ్యకార్యదర్శి స్వయంగా హాజరు కావాలని పేర్కొంది. అంతేగాక ఇచ్చిన గడువులోగా కౌంటర్‌ దాఖలు చేయలేకపోతే ఇంగ్లిష్‌ మీడియం అమలుపై సే ఉత్తర్వులు ఇచ్చేందుకూ వెనుకాడబోమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎస్‌. జయసూర్యల ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్వా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్‌ చేస్తూ తూర్పుగోదావరి జిల్లాకు వెందిన రాంభొట్ల శ్రీనివాస్‌ సుధీష్ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సోమవారం మరోమారు ధర్మాసనం ముందు విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌. శ్రీరాం వాదనలు వినిపిస్తూ, విద్యార్థులు మాతృభాషలో చదువుకునేందుకు తాము అద్దు చెప్పడం లేదని, ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు పది రోజుల సమయం కావాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం తరపున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ కృష్ణమోహన్‌ వాదనలు వినీపిస్తూ... విద్యాహక్కు చట్ట ప్రకారం కనీసం 8వ తరగతి వరకు మాతృభాషలోనే విద్వాబోధన ఉండాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ... ఇంగ్లీషు మీడియుంలోనే విద్యాఖ్యానం ఉండాలని విద్యార్థులను బలవంతపెట్టలేమని పేర్కొంది. పిటిషనర్‌ శ్రీనివాస్‌ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ...ఇంగ్లీష్‌ మీడియం అమలు దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తూనే ఉందని, అధికారులు వివిధ రకాల సమావేశాలు నిర్వహిస్తున్నారని వివరించారు. దీంతో ధర్మాసనం అధికారులపై తీవ్రంగా స్పందించింది.


బాటలు వేయడం ఒక మార్గం కాగా ప్రభుత్వ రంగంలో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టి సర్వ వినాశనానికి దారులు వేయడం రెండవ మార్గం. రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం రెండవ మార్గాన్నే అనుసరించింది. 2008లో ప్రైవేటు తోక పుచ్చుకుని ప్రభుత్వరంగ ఉన్నత పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమాన్ని సమాంతరంగా ప్రవేశ పెట్టింది. ఇదే ఒరవడిని కొనసాగించిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం (2014-2019) సుమారు ఇరవై అయిదు శాతం ప్రభుత్వ రంగ ప్రాథమిక పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే రాజశేఖర్‌ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు రెండూ ప్రభుత్వ పాఠశాలలలో అంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాయి. అయితే, తెలుగు మాధ్యమాన్ని కనీసం సమాంతరంగా కొనసాగించాయి. ఇప్పటి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుచ్వం ప్రభుత్వరంగ పాఠశాలలలో మాతృభాషా మాధ్య మాన్ని మొత్తం నిషేధించింది. అందుకే చర్చ ఇంత తీవ్రంగా జరుగుతున్నది. మాతృభాషా మాధ్యమమే విద్యావ్యాసంగానికి మంచిదని, ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో కూడా మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయాలనే సలహా ప్రభుత్వానికి రుచించక పోవచ్చు. కార్బోరేటు ఒంటికి అసలు పడదు. అయితే ప్రైవేటు పాఠశాలలను ప్రక్మన పెట్టి మాతృభాషా మాధ్యమం గురించి మాట్లా డడం ఎంతవరకు సమంజసం? ప్రైవేటులో అంగ్ల మాధ్యమం ఉండగా ప్రభుత్వరంగంలో మాతృభాషా మాధ్యమం నిలదొక్కుకోవడం కష్టం. ప్రభుత్వమే తన బాధ్యతను గ్రహించి ప్రైవేటు పాఠశాలలతో సహా అన్ని పాఠశాలలలో తప్పనినరిగా మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయడం న్యాయమైనది, రాజ్యాంగబద్ధమైనది మరియు శాస్త్రీయమైన పద్ధతి అవుతుంది. అందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు కాబట్టి, ఓటు రాజకీయాలనే కొనసాగిస్తోంది కాబట్టి ప్రజా ఉద్యమమే పరిష్కారం అవుతుంది.

రచయిత - ఆంధ్రప్రదేశ్‌ విద్యాపరిరక్షణ కమిటీ కన్వీనర్‌, అఖీలభారత విద్యాహక్కు వేదిక అధ్యక్ష వర్ణ సభ్యులు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2020

11