పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

పీపుల్స్ ఫ్రెండ్

పీపుల్స్ ఫ్రెండ్ అవతరణ - నాటి మద్రాసు పత్రికల స్థితి

క్రీ.శ. 1785 లో మద్రాసు కొరియర్ (Madras Courier), మద్రాసు గెజిటు (Madras Gazette), మద్రాసు మేల్ అసైలం హెరాల్డు (Madras Male Asylum Herald) మొదలైన పత్రికలు ఆరంభించబడ్డాయి1. మూడూ వారపత్రికలే. ఈ పత్రికలు కొద్దికాలం మాత్రమే కొనసాగాయి. వీటి తర్వాత మద్రాస్ కన్సర్వేటివ్ (Madras Conservative) ఆరంభమయింది. 1832లో ఫోర్ట్ సెయింట్ జార్జి గెజిటు (Fort Saint George Gazette) ప్రారంభమయింది. ఇది ఈస్టిండియా కంపెనీ (East India Company) అధికార పత్రిక. పోస్టేజి అవసరం లేకుండా ప్రెసిడెన్సీకంతటికీ బట్వాడా అయ్యేది. ఇంగ్లీషుతో పాటు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో ప్రకటనలుండేవి2. 1833లో కర్ణాటిక్ క్రానికల్ (Carnatic Cronicle) ఇంగ్లీషు, తమిళం, తెలుగు, త్రిభాషా పత్రికగా ఆరంభమైంది. ఈ పత్రిక మతవివాదాల జోలికి పోకుండా, స్థానికవిషయాలకు ప్రాధాన్యం ఇచ్చింది3. 1840లో సి. నారాయణస్వామినాయుడు నేటివ్ ఇంటర్‌ప్రిటర్ (Native Interpreter) పత్రికను ప్రారంభించాడు.