పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

45


రాశాడు. ఈ ఉత్తరం ద్వారా ఆయన వ్యక్తిత్వం, మతవిశ్వాసాలు వ్యక్తమయ్యాయి.12

నెల్లూరు,

ఫిబ్రవరి తే 22 ది 1876

మహారాజ రాజశ్రీ, రాజా వెలుగోటి కుమారయాచమనాయుడు బహదర్ - సి.యస్.ఐ పంచహజార్ మనసబ్‌దార్ రాజా ఆఫ్ వెంకటగిరి వారి సముఖమునకూ -

తమరిచ్చిన నీతిసూత్రశతము దీనితోటి మరల పంపించడ మగుచున్నది. అది యిచ్చినపుడు దానిని ప్రచురపరచి తెలుగు బళ్ళలోకి తేవచ్చునని వాక్రుచ్చితిరి. గనుక దాని విషయమై నాకు తోచిన యభిప్రాయము వ్రాసెదను. గనుక మన్నించెదరని నమ్మెద. దానిని పూర్తిగాఁ జూచినాను. మరియు కొందరికిఁ జూపించినాను. సదరు గ్రంథములో జెప్పిన నీతులు యందరికి నుపయోగించునవి కొన్ని అనఁగా పెన్‌సల్‌తో గురుతు చేయబడినది రాజ ధర్మములుగాను సమరసములేక యున్నవి. ఈ గ్రంథము లోకమున కుపయోగకరముగా నుండగోరిన యడల అందరికి నిరాక్షేపణీయముగ నుండుట బాగని తలచి.... కారము గురుతు పెట్టినాను. అవితప్ప కొదమవి అందరు ఒప్పుకొనదగినవిగానే యున్నవి. గనుక వాటిని యెత్తి సంధి లేకపోయినను వ్యాకరణ పద్దతిగా వ్రాసి అచ్చువేయించిన యడల లోకోపకారముగానే యుండును. మరియు..... అన్ని మతస్థులకు సమానముగా నుండు నటుల శ్రీ రాధాకృష్ణ సహాయం అనక దైవసహాయం అనిగాని లేక అందరికి సామాన్యమైనటువంటి (........) ముతోగాని ఆరంభించిన యడల బాగుండునని తోచుచున్నది. తమరు రచియించిన గ్రంథము మీద యేమిగాని చెప్పుటకు నాకంత యోగ్యత లేదు... యిప్పటికి సమరస అభిప్రాయము గురించి తమకు తెలిపిన యడల బాగుండునని వ్రాసితిని. గనుక చిత్తగించవలయును.

విధేయుడు

సి. కోటయ్య

భాషా విషయంలో కోటయ్యసెట్టిది వెనుకచూపు. 1864 నాటికే సర్వజ్ఞకుమార యాచేంద్ర వచనం ప్రాముఖ్యాన్ని, వాడుకభాష అవసరాన్ని గ్రహించాడు.

నెల్లూరు పయొనీర్

నెల్లూరు పయొనీర్ గురించి ఒంగోలు వెంకటరంగయ్య రాసినది తప్ప, కొత్తగా ఎవరూ ఏమి చెప్పలేకపోయారు. ఈ పత్రిక పందొమ్మిదవ శతాబ్ది అరవయ్యోపది చివర వెలువడిందని, కలెక్టరు కచేరి ఉద్యోగులు నంబెరుమాళ్ళయ్య, నరసయ్య కలిసి ఈ పత్రిక నడిపారని, పత్రికను వెలువరిస్తున్న సమయంలో నరసయ్య నెల్లూరు