పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

13


మరుసటి రోజు 26వ తారీకు బుధవారం మహర్నవమినాడు ఇట్లా రాశాడు.

"According to native calender this is my 58th birthday."

వీరేశలింగంకన్న నరసయ్య ఏడాది చిన్న, మద్రాసు పచ్చయ్యప్ప సెంట్రల్ స్కూల్లో ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో చదువు కొనసాగించాడు. పనప్పాకం అనంతాచార్యులు నరసయ్య సహాధ్యాయి. అనంతాచార్యులు నరసయ్యకన్న ఆరేళ్ళు పెద్ద. ఇద్దరూ 1864లో జరిగిన మెట్రిక్యులేషన్ పరీక్ష రెండవ తరగతిలో పాసయ్యారు.9 నరసయ్య పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో “అసిస్టెంట్ టీచరు” ఉద్యోగంలో ఎప్పుడు చేరాడో తెలియదు. 1867 మార్చి నాటికి ఆ ఉద్యోగం చేస్తున్నాడు. అప్పటికి మైనారిటీ కూడా తీరలేదు. ఆయన సహాధ్యాయి అనంతాచార్యులు 1867లో ఎఫ్.ఏ పాసయి, ఆ పాఠశాలలోనే అధ్యాపకవృత్తిలో కొంతకాలం ఉన్నాడు. 10

నరసయ్య బి.ఏ. పాసయినట్లు ఒకరు అన్నారు. ఆయన బి.ఏ. అని ఎక్కడా చెప్పుకోలేదు. 1872వ సంవత్సరం ఆరంభంలో ఆయన డెప్యూటీ స్కూల్ ఇన్‌స్పెక్టరు ఉద్యోగానికి ఎంపిక అయ్యా డు. "... Graduates and under Graduates who have had experience as teachers and have good knowledge of Telugu" అని ఆ ఉద్యోగానికి అర్హతలు నిర్దేశించారు.11 ఆ ఉద్యోగానికి అర్హత ఉత్త మెట్రిక్యులేషన్ కాదని అనిపిస్తుంది. నరసయ్య మెట్రిక్యులేషన్ పాసయిన మూడేళ్ళకు పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో అధ్యాపకుడుగా చేరాడు. ఈ వ్యవధిలో ఆయన ఎఫ్.ఎ. పాసయి ఉంటాడనిపిస్తుంది. 1876లో పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డైరెక్టరు కల్నల్ ఆర్.ఎం.మెక్‌డొనాల్ట్ (Col. Mac Donald) రాజమండ్రి ప్రభుత్వ కళాశాల స్థాయి పెంచవలసిన అవసరాన్ని పై అధికారుల దృష్టికి తీసుకొనివస్తూ, తనవాదనకు బలమిచ్చే రెండు అంశాలను పేర్కొన్నాడు. మొదటిది విద్యకు ఉపాధికి మధ్య ఉన్న సంబంధం. తెలుగుభాష వ్యవహారంలో ఉన్న ప్రదేశాలలో ఎక్కడా కళాశాల లేదని, అందువల్ల ప్రభుత్వోద్యోగాలలో నియమించడానికి, అర్హులైన అభ్యర్థులు లభించడం కష్టంగా ఉందంటాడు. “డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్సు హోదాలో గానీ, ఒక ముఖ్యమైన స్కూల్లో ఉపాధ్యాయుడుగా గానీ తెలుగువాడు లేడు” అని ఇంకోవాస్తవాన్ని పేర్కొన్నాడు.12 ఇందువల్ల డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉద్యోగానికి కళాశాల చదువు అవసరమని స్పష్టమవుతూంది. గెజిటు ప్రకటనలో "Graduates and under Graduates" అని ఉండడంవల్ల నరసయ్య ఎఫ్.ఏ. పాసయినట్లు భావిస్తున్నాను. ఆ రోజుల్లో ఆంగ్లో వర్నాక్యులర్ స్కూళ్ళల్లో (Anglo vernacular Schools) ఉపాధ్యాయుడుగా నియమించబడడానికి మెట్రిక్యులేషన్ పాసయి ఉండాలి. కాబట్టి నా ఊహ సరి అయినదే అని తోస్తూంది. ఆ రోజుల్లో