పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

దంపూరు నరసయ్య

Friend' రెండు సంచికలను ముందరి పుటలను ఫోటో తీయించాను. ఆయన edit చేసిన నాలుగు పత్రికల్లో కనీసం ఒకటైనా original రూపంలో చూడగలిగినందుకు నేను ఎంత పరవశం చెందానో, దాదాపు తొమ్మిదేళ్ళ తపస్సు ఫలించింది. ఆయనను గురించి ఒక చిన్న గ్రంథం రాయడానికి ఆత్మవిశ్వాసం కలుగుతున్నది” అని తన ఆనందాన్ని పంచుకొన్నాడు.25 ఆయన సంకల్పం ఏ కారణం వల్లనో నెరవేరలేదు. ఆ రెండు సంచికలు చదివి ఆయన రాసుకొన్న నోట్సు కూడా నాకు లభించలేదు.

1990 వేసవిలో ముగ్గురు మిత్రులం - మధ్వపతి జయరామారావు, మాచవోలు శివరామప్రసాద్, నేను కలిసి నరసయ్య దినచర్యలు చదవడానికి ప్రయత్నించాము. 1898, 1906 దినచర్యలు దాదాపు సమగ్రంగా చదవగలిగాము. 1905 దినచర్య చదవడం మాకు సాధ్యం కాలేదు.

నరసయ్య మీద పుస్తకం రాయడానికి ప్రయత్నం చేస్తున్న రోజుల్లో నేను సేకరించుకొన్న నోట్సులు, కాగితాలు మొత్తం ఫైలు కన్పించకుండా పోయింది. ఆ తర్వాత, పదేళ్ళకు యాదృచ్చికంగా ఆ ఫైలు బయటపడింది. నేను రాసుకొన్న నోట్సులు, కాగితాలు చివికి చినిగిపోయాయి. కొన్ని పుటలు కన్పించలేదు. పోయినవిపోగా మిగిలిన నోట్సులు, కాగితాలు దగ్గర పెట్టుకొని నా ప్రయత్నం మళ్ళీ కొనసాగించాను. 1905 దినచర్య 'scan' చేసి, కంప్యూటరు స్క్రీన్ మీద చదవడం సాధ్యమయింది. ఈ సమాచారంతో పుస్తకం తయారుచేశాను. పుస్తకాన్ని ముద్రణకు సన్నద్ధం చేస్తున్న తరుణంలో, పద్దెనిమిదేళ్ళ తర్వాత, మళ్ళీ ఒకసారి చెన్నై తమిళనాడు ఆర్కైవ్స్ లో నరసయ్యకు సంబంధించి కన్పించకుండా పోయిన ఫైళ్ళ కోసం ‘దింపుడుకళ్ళం' ఆశగా అన్వేషించాను. అదృష్టవశాత్తు జి.ఓ నంబరు 455 ఫైలు బయట పడింది. ఇందులో 1888 ఫిబ్రవరి 25 పీపుల్స్ ఫ్రెండ్ సంచిక, ఇతర పత్రాలు ఉన్నాయి. ఈ సమాచారం కూడా పుస్తకంలో చేర్చాను. . |

నరసయ్య బతికినదినాల్లో, పోయినతర్వాత 'చంపబడుతూనే' ఉన్నాడని అనిపించింది. మన చారిత్రక స్పృహకు, దేశశ్రేయస్సు కోసం పాటుపడిన మహనీయుల ఎడల మనం ప్రదర్శించే ఉపేక్షకు నరసయ్య ఉదంతం సాక్ష్యంగా నిలుస్తూంది. ఈ సందర్భంలో నరసయ్య దినచర్యలో రాసుకొన్న మాటలను ఉదాహరించడం అనౌచిత్యం కాదనుకొంటాను.

"Lord ! when will all this cease and will a quiet life (begin) free of anxiety and trouble from creditors, enemies and false friends".

(11th September 1905)