పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

చెన్నపట్నం

అనుభవాలూ - ప్రభావాలు

తుమ్మగుంట ద్రావిడ బ్రాహ్మణులు

నరసయ్య తుమ్మగుంట ద్రావిడ బ్రాహ్మణుడు. ఈ శాఖవారు వందలనంవత్సరాల కిందట తమిళదేశంలోని 'మళైనాడు’ నుంచి నెల్లూరు మండలానికి వలసవచ్చారు.1 నెల్లూరుకు తూర్పుగా, సముద్రతీరానికి సమీపంలో ఉన్న తుమ్మగుంట గ్రామంలో స్థిరపడడం వల్ల, వీరికి తుమ్మగుంట ద్రావిడులనే పేరు వచ్చింది. కొన్ని ద్రావిడ కుటుంబాలు తమిళ దేశం నుంచి వచ్చి నెల్లూరు మండలంలో పుదూరుగ్రామంలో మొదట స్థిరపడ్డారు. వారికి పుదూరు ద్రావిడ బ్రాహ్మణులనే పేరు వచ్చింది. తుమ్మగుంట ద్రావిడులు తమిళాన్ని విడిచి పెట్టి, తెలుగు మాతృభాషగా స్వీకరించినా, తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అంగీకరించి, తెలుగు వారిలో కలిసి పోయినా, మతాచార వ్యవహారాలలో మాత్రం తమిళదేశపు సంప్రదాయాలనే అనునరిస్తూ వచ్చారు. ఇరవయ్యో శతాబ్ది నగబడేవరకూ, వీరిలో అధిక సంఖ్యాకులు వ్యవసాయంచేసి, జీవనం కొనసాగించారు. స్వయంగా