పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

దంపూరు నరసయ్య


ఇరవై అయిదు శాతం కూడా స్కూళ్ళకు పోవడంలేదని నిట్టూరుస్తాడు. "ప్రభుత్వం విద్యాభివృద్ధికి చేస్తున్న ప్రయత్నం వృథా అవుతూంది. ఇప్పుడు అమలులో ఉన్న “సాధారణ గ్రాంటు స్కూళ్ళ విద్యా విధానం” విద్యను ప్రోత్సహించడం లేదు. సామాన్య ప్రజలకు విద్యమీద ఆసక్తి లేదు. వారి దృష్టి చదువుమీద నిలిపే ప్రయత్నం కొనసాగడం లేదు. ఈ పరిస్థితికి ఎవరిని తప్పుపట్టాలి? చిన్నపిల్లలనా? తల్లిదండ్రులనా? ప్రభుత్వాన్నా?” అని ప్రశ్నిస్తాడు.

పల్లెటూళ్ళలో కాస్త తెలివితేటలున్న వారిని ఉపాధ్యాయులుగా నియమించి వారికి జీతబత్యాలు ఏర్పాటు చెయ్యాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల దగ్గర 'ఫీజు' వసూలు చేసుకొనే అవకాశం ఇవ్వాలని సూచిస్తాడు. ఏడాదికొకసారి ఇన్‌స్పెక్షను జరిపి అసమర్థులైన ఉపాధ్యాయులను తొలగించాలని స్కూళ్ళ సంస్కరణను సూచిస్తాడు.20 సూళ్ళలో ఇంగ్లీషు బోధన సక్రమంగాలేదని, తరచుగా పాఠ్యపుస్తకాలను మార్చడం మంచి పద్దతి కాదని, నరసయ్య అభిప్రాయం. "Nesfield's Grammar" లోపాలను వివరించి, ఇంగ్లీషు వ్యాకరణ బోధనలో అనుసరించవలసిన పద్ధతులను సూచిస్తాడు.21 1898-99 మద్రాసు అడ్మినిస్ట్రేషను రిపోర్టు (Madras Administration Report) ను ఉదాహరించి, ప్రెసిడెన్సీలోని 53 శాతం పెద్ద ఊళ్ళలో, 94 శాతం చిన్న ఊళ్ళలో స్కూళ్ళులేవని, ఈ అన్యాయమైన పరిస్థితిని చక్కదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నాడు. “ప్రతి గ్రామంలో ఒక చిన్నబడి ప్రభుత్వం ఎందుకు ప్రారంభించకూడదు? విద్యలేని ప్రజలు అజ్ఞానులతో సమానమైనవారు” అని చెప్తూ స్కూలు సెస్సు వసూలుచేసి ప్రతి ఊళ్ళో బడి జరపవచ్చని సలహా ఇస్తాడు. పట్టణాలలో ప్రజలకు ఎన్నో వసతులు ఏర్పాటు చేస్తున్నారని, గ్రామాలలో సక్రమంగా ఉత్తరాలు బట్వాడా చేసే ఏర్పాటు కూడా లేదని పల్లెటూళ్ళపట్ల ప్రభుత్వ వివక్షను ప్రశ్నిస్తాడు.22

గ్రామ న్యా యస్థానాలు (Village Courts)

గ్రామ న్యాయస్థానాలమీద ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో నరసయ్య తరచుగా రాశాడు. 1889 ఒకటవ యాక్టు (Act I of 1889) ప్రకారం విలేజి కోర్టులు ఏర్పాటయ్యాయి. ఈ చట్టం పరిధిలో గ్రామాల్లో చిన్న చిన్న సివిల్ క్రిమినల్ కేసులను విచారించి, పరిష్కరించే బాధ్యత, అధికారం గ్రామాధికారులకు, విలేజి మున్సిపులకు అప్పగించబడింది. ఈ గ్రామ న్యాయస్థానాల వ్యవస్థ నెల్లూరు జిల్లాలో చక్కగా అమలు కాలేదు. విలేజి కోర్టులు చక్కగా పనిచేస్తే, గ్రామాలలో తగాదాలు తగ్గి శాంతి నెలకొంటుందని, 'లిటిగేషన్' (litigation) సమసిపోతుందని నరసయ్య అభిప్రాయపడ్డాడు. ప్రతి పెద్ద గ్రామంలో విలేజి కోర్టు ఏర్పాటు చెయ్యాలని, కొన్ని చిన్న ,