పుట:Endaro Wikimedianlu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇన్‌ఫ్లుయెన్సరు

ఆయన వికీపీడియాలో నిర్వాహకుడు, అధికారి. వికీసోర్సులో నిర్వాహకుడు. విక్షనరీలో నిర్వాహకుడు. తెవికీలో 90 వేలు, తెలుగు విక్షనరీలో 30 వేలు, తెలుగు వికీసోర్సులో 57 వేలు, తెలుగు వికీకోట్‌లో వెయ్యి, వికీడేటాలో 20 వేలు, వికీ కామన్సులో 65 వేలు, ఇంగ్లీషు వికీపీడియాలో 40 వేలు, ఇంగ్లీషు విక్షనరీలో 70 వేలు, ఇంగ్లీషు వికీసోర్సులో 40 వేలు - ఉప్ఫ్... వెరసి అన్ని రకాల వికీల్లోనూ ఆయన చేసిన మొత్తం దిద్దుబాట్లు నాలుగు లక్షల పైచిలుకు. ఇందులో ఉన్నాడు అందులో లేడు అని అనడానికి లేదు... అన్నింటా ఉన్నాడు చక్రి లాగా! ఇన్ని ప్రాజెక్టుల్లో ఇంత విరివిగా రాసిన ఈ చక్రి ఎవరూ…? ఎవరయ్య ఎవరు వారు… ఇంకెవరయ్య రాజశేఖరు!

ఔను, డాక్టర్ రాజశేఖరతడు. సినిమా హీరో కాదు, వికీహీరో! మేం ఆటలను ప్రోత్సహిస్తాం అని తమ ఎడ్వర్టైజ్‌మెంటులో చెబుతూ టాటా స్టీల్ వారు, చివర్న, వియాల్సో మేక్ స్టీల్ అని చెప్పుకునేవారు. అలాగే మనం కూడా డాక్టర్ రాజశేఖర్ గారు తన స్వంత పాథాలజీ ల్యాబును నిర్వహిస్తూంటారు కూడా అని నిరాక్షేపణీయంగా చెప్పవచ్చు. వికీపీడియాలో ఒక్కొక్క హీరోది ఒక్కొక్క పద్ధతి. చిన్నచిన్న అడుగులు, పెద్దపెద్ద విజయాలు అనేది ఈయన పద్ధతి. పద్ధతి ఏదైతేనేం అంతిమ లక్ష్యం వికీ అభివృద్ధే ఐనపుడు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా ఈ హీరోను గుర్తించారు, తమ ఉగాది పురస్కారాల ద్వారా! జీవశాస్త్రం, సాహిత్యం వగైరాల మీద వ్యాసాలు రాస్తూంటారు. రాయడమే కాదు, రాయిస్తారు కూడా. వికీలోకి కొత్తగా వచ్చినవాళ్ళకు, వద్దామనుకుంటున్నవాళ్ళకూ ఫోన్లు చేసి రండి రండి, రాయండి రాయండి అంటూ ప్రోత్సహిస్తూ ఉంటారు. వికీలో

ఎందరో వికీమీడియన్లు

35