ఈ పుట ఆమోదించబడ్డది
కొత్తవాళ్ళు ఎవరైనా రాజశేఖర్ గారికి పరిచయమైతే వాళ్ళు నానాటికీ వికీ ప్రాజెక్టుల ఆకర్షణలో పడిపోతారు. వాళ్ళ ఆసక్తులేమిటో, ఇష్టాలేమిటో, బలాబలాలేమిటో తెలుసుకుని, వాళ్ళకి నచ్చే పనులు వికీలో ఏమేం చేయొచ్చో చెప్పి, చేయించి, భుజం తట్టి, "మీరు సూపర్ సార్", "అద్భుతంగా చేస్తున్నారు మేడం" అని ప్రోత్సహిస్తారు. ఇదంతా అయ్యాకా అవతలి వ్యక్తి హనుమంతుళ్ళా సముద్రాన్ని లంఘించేంత విజృంభిస్తారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లంటూ ఇప్పుడు కొత్తగా వస్తున్నారు గానీ... మా డాక్టరు గారు ఎప్పటి నుండో వికీ ఇన్‌ఫ్లుయెన్సరు! జస్ట్... ఆ పేరు మాకు తట్టడం లేటైంది, అంతే! ఆయన మాత్రం అందరికంటే ముందే!
ఎందరో వికీమీడియన్లు
36