Jump to content

పుట:Endaro Wikimedianlu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"మొదటిపేజీ"కి ఆ పేరు పెట్టినది అతడే. ఆ తరువాత దాన్ని మార్చాలని కొందరు అన్నారు గానీ అదే నిలబడి పోయింది. ప్రతి పేజీకీ ఉండే "చరిత్ర" ట్యాబుకు నాగార్జున తొలుత "చరితం" అని పెట్టాడు. తరువాత దాన్ని మార్చారు. తెవికీ యవనికపై అప్పట్లో వెలిగిన తెలుగు తళుకులకు తెరవెనక ఉన్న చోదక శక్తి అతను.

పాలు పితకడం నుండి మజ్జిగ చెయ్యడం దాక ఎలా చేసాడో, ఏ కష్టాలు పడ్డాడో తెలీదు గానీ.. నాగార్జున పంచిన వెన్నను మాత్రం అందరూ ఆస్వాదిస్తున్నారు.

ఎందరో వికీమీడియన్లు

16