Jump to content

పుట:Endaro Wikimedianlu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూలకర్త

రాజీవ్ గాంధీ భారతదేశానికి పర్సనల్ కంప్యూటరు తెచ్చాడు. పీవీ, మన్మోహన్‌లు కొత్త ఆర్థిక విధానాలు తెచ్చారు. వాజపేయి భరత మాత మెడలో రహదారుల నగ అమర్చాడు. వెన్నా నాగార్జున తెలుగు వికీపీడియా తెచ్చాడు.

విండోస్ 98, ఎక్స్‌పి ల రోజులవి. కంప్యూటర్లకు అసలు తెలుగు చూపించడమే తెలియని రోజులు. కంప్యూటర్లో తెలుగు కనబడేది కాదు, ఏవో పెట్టెలు కనబడేవి. తెలుగు చూపించాలంటే వాటి సెట్టింగుల్లో మార్పులు చేసుకోవాల్సివచ్చేది. ఇక తెలుగులో టైపించడమంటే మరీ కష్టం. తెలుగు కీబోర్డుల్లేవు. ఉన్నా, ఆ లేఔట్లు ఒక్కోటి ఒక్కో రకంగా ఉండేవి. అలాంటి రోజుల్లో, మామూలుగా రోమను లిపిలోనే టైపు చేస్తే తెలుగు లిపిలోకి మారిపోయేలా పరికరాన్ని రూపొందించాడు నాగార్జున. తన సాఫ్టువేరు పరిజ్ఞానాన్ని తెలుగు కోసం ఉపయోగించాడు. యాహూ వారి జియోసిటీస్ అనే వెబ్‌సైటులో ఒక పేజీపెట్టి అందులో పద్మ అనే లిప్యంతరీకతరణ పరికరాన్ని అమర్చాడు. 20 యేళ్ళ కిందటే ఈ పరికరాన్ని తయారుచేసాడు. ఆ వెబ్‌సైటు ఇప్పుడు లేదు. ఆర్కైవు వారి పుణ్యమా అని వాళ్ళ భాండాగారంలో చూడొచ్చు దాన్ని ఆ పేజీలో ఉండే పెట్టెలో రోమను లిపిలో తెలుగు రాసి, తెలుగులోకి మార్చు అనిచెప్తే దాన్ని తెలుగు లిపిలో చూపించేది. ఆహా తెలుగులో రాయడం ఇంత తేలికా అనుకున్నారందరూ.

ఇదే నాగార్జున తెలుగు వికీపీడియాను కూడా తెచ్చాడు. ఇక చూడండి. పద్మ పేజీలో తెలుగు రాయడం, దాన్ని కాపీ చేసి తెచ్చి వికీపీడియాలో పెట్టడం. ఇలా సాగింది తెలుగు వికీపీడియా ప్రస్థానం. అన్నట్టు తెవికీ

ఎందరో వికీమీడియన్లు

15