పుట:Ecchini-Kumari1919.pdf/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణ ము 16

87

మొద — పశ్చిమ సముదతీరముననున్న యొక పల్లెకు.

రెండ: -మంచిది, నేను గూడ నీతోఁ జాలవఱకు నచ్చెదను.

మొద: ఎంతదూరము ?

'రెండ: వల్లభీపురము ఏజకును.

"మొద:... -సరియె! మనము కలసియె పోవుదము,

అని వారు కూడఁబలికికొనుచుఁ బోవసాగిరి. మహా రణ్యముల చేతను, గుట్టల చేతను దుర్గను మగు నామార్గము వారిని మిగుల శ్రమ పెట్టెను, కొంతదూరమేగిన తరువాత వా రోక చెట్టునీడను విశ్రమించిరి. ఆ రెండన బాటసారి యాయాసముచే మాటాడక మొదటివానివంక, జూచుచుం గూర్చుండెను. మొదటి బాటసారి మార్గాయాసమునకు సుంత యైన బడలినట్లు గనఁబడ లేదు. గనఁబడ లేదు. అతని మొగ మెప్పుడును సంతోషపూర్ణమైనట్లు గనుపట్టుచుండెను. అందులకుఁ గారణ మేమైయుండు నని రెండవవాఁ డూహించెను. ఏమియు గ్రహింప లేక పోయెను. కాని, మొదటివాఁడు భార్యతో జేసిన సంభాషణము విన్నందున నా రెండవ బాటసారి బరిశీ లించి యాపురుషుఁ డేదియో ఘన కార్యము నెఱ వేర్చియున్న ట్టును, వాఁ డొనర్చిన పని కేదో పెద్ద బహుమానము నొందఁ దలంచుచున్నట్టును మాత్రము దెలిసికొనెను. అయిన నతఁ డందువిషయమై యేమియుఁ బ్రసంగింప లేదు.మార్గాయాసము కొంచెము తఱిగినందున వారు మరల నడవనారంభించిరి,