పుట:Ecchini-Kumari1919.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

ఇచ్చ నీ కు మారి

అప్పుడైనను రెండవబాటసారి యతనివృత్తాంతమును గూర్చి తరిచి యడుగలేదు. మొదటివాఁడు గూడ నెన్నియో పూర్వవృత్తాంతములును, దేశసమాచారములును జెప్పుచుండెను. కాని, తనసంతోషమునుగుఱించి యేమియును మాటాడలేదు. అప్పటికి సూర్యుఁడు గగనమధ్యముననుండి యగ్గి గురియించుచుండుటచే నెండవేఁడిమికి దాళఁజాలక మఱియొకమాఱు చెట్టునీడను విశ్రమించిరి. మొదటివాఁడు కొంతసేపటివఱకు రెండవవానితో సరిగా మాటలాడుట మానివేసినను క్రమముగా స్నేహము ముదురుటచేఁ దనకష్టసుఖములనుగుఱించియు, గృహవిషయములను గుఱించియు రెండవవానితో జెప్పుచుండకపోలేదు. మఱియు, రెండవవాఁడు సత్ప్రవర్తనునివలెఁ గన్పట్టుటచే వానియందు మొదటివానికి విశ్వాసము గూడ హెచ్చెను.

అందుచే వాడు తనమూటలోని యొకయుత్తరమును దీసి “అయ్యా! నేను జదువెఱుఁగనివాఁడను. దీనిలో నా కెంత బహుమాన మిమ్మని వ్రాయఁబడినదో తెలుపుఁ' డని కోరెను. అంత రెండవవాఁ డతనితో నీకు రెండువేలరూపాయలు బహుమాన మిమ్మని వ్రాసినారని చెప్పి యాయుత్తరము మణఁచి మొదటివాని కిచ్చివేసెను. వారు తెచ్చుకొన్న తినుబండము లచ్చటఁ దినివేసి యాతపబాధ కొంచెము కొంచెము తఱిగినందున మరల నడచి పోవసాగిరి. మార్గాయాసము పూర్తిగా నడఁగిపోవుటచేతనో, యప్పుడే తృప్తిగా