పుట:Ecchini-Kumari1919.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర క ర ణ ము 14

73

పడుచున్నది. లెండు లెండు' అని పల్కఁగా వారు లేచి నిద్దురచే మూతపడుచున్నకన్నులతోనే యాసవారీని మోసికొనిపోయిరి.

పదునాల్గవప్రకరణము

ఢిల్లీపురములోని కుట్ర

ఢిల్లీపురమున నొకవిశాలరాజభవనమందుఁ బృథ్వీరా జొకనాఁడు నిండుకొలువుదీర్చియుండెను. అతనికిఁ గుడిప్రక్కన నతనిపినతండ్రి కరుణరాజును, నతనికుమారుఁడును, మఱి కొందఱు రాజులును గూర్చుండిరి. ఆసింహాసనమున కెడమవైపున మంత్రులును, సేనానాయకులును, చాళుక్యవంశజు లగు ప్రతాపసింహాదులును గూర్చుండిరి. తక్కిన సామాన్యజనులు యథోచితస్థానముల నుండిరి. దాడిమిబీజములవలెఁ గ్రిక్కిఱిసిన ప్రజాసమూహముచే నాసభాభవనము నిండి పున్నమనాఁటిసముద్రమువలెఁ దొణుకులాడుచుండెను.

ఆసమయమున చాందుభట్టనెడి మహాకవి లేచి రాజేంద్రున కెదురుగా సభామధ్యమున నిలిచి మేఘగర్జనమువలె గంభీర మగు కంఠస్వరముతోఁ జోహానవంశజులకీర్తిని, బరాక్రమమును, సాహసమును, ధైర్యమును బొగడుచుండెను. ఆగుణవర్ణనము విని సభ్యులందఱును సంతోషించుచుండిరి. కాని, చాళుక్యవంశసంభవుఁ డగు ప్రతావుఁడు లోకములోని