పుట:Ecchini-Kumari1919.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 13

65


ఓయీ ! నీవు వట్టి వెర్రి వాఁడవు సుమా ! ఇట్టి వెర్రిని జూపితివా యిచ్ఛిని నిన్నుఁ బెండ్లాడదు. నా ప్రయాసమంత యును వ్యర్థమగును. అట్లు చేయకుము. స్త్రీ. లెప్పుడును నే నీతనిఁ "బెండ్లాడుదునని నోటితోఁ బల్కరు. తమయభిప్రాయ మును జేష్టలచే సూచింతురు; వినుము, ఆ రాకుమారి యీ రాత్రి యచ లేశ్వరునిదర్శింప నిశ్చయించుకొని నిన్ను సహా యునిగా రమ్మని కోరుచున్నది. ఇంక నింతకంటే 'నేమి కావల యును. నీయందుఁ బర పురుష బుద్ధియే కల్గిన నిన్నా మె రా నిచ్చునా ? మఱియు, నేను నీగుణములు వర్ణించి చెప్పితిని. ఆమె యన్ని యు నత్యాదరముతో విన్నది. ఇఁక ని న్నా మె చేపట్టుట నిస్సంశయము. నేనింత కష్టపడి నందులకు నా కీయఁ డలఁచిన బహుమాన మీరాత్రియే యిమ్ము' అని యామె పల్కెను.

'తప్పక యిచ్చెదను. ఇప్పుడే తెచ్చెదను. ఈ రాత్రీయే వెళ్ళవలయునా ! నీవుగూడ వచ్చెదవా ?'అని యతఁ డడిగెను.

“వచ్చెదను. ఆమె దేవ తాదర్శనమునకు: బోవుచున్న విషయము నీకుఁ దప్ప మెరెవ్వరికిని వెలియనీయఁగూడదని యా రాజకుమారి యభిప్రాయము, నీ వెవ్వరికిని దీనిని జెప్ప కుము. ఆమె యాలయమునకుఁ బోయివచ్చుటకు సవారి నొక దానిని సిద్ధపఱుపుము, నేఁడు నీవు చేసిన యేర్పాటుల కామె 'యెంతయు సంతసింపవలయును. నీవు త్వరగాఁ బోయి. భుజించి రమ్ము. వచ్చునప్పుడు నా బహుమానము మాత్రము మఱవ