పుట:Ecchini-Kumari1919.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదు మూఁ డ వ ప్రకరణముసాయంసమయమునకు రూపనతి కన్యాంతఃపురము నుండి యింటికి వచ్చునప్పటికి వాడుక చొప్పున నభయసింగు వచ్చి తనయింటియరఁగు పై గూర్చుండెను. రూపవతి యతని నల్లంత దూరముననె చూచి మందహాసముచేసి రాజకుమారా ! నీ వే ధన్యుఁడవు ధన్యుఁడవు' అని పలికెను. ఆతఁ డది విని యధి కానందభరితుఁడై లేచి యామె కెదురుగఁ బోయి 'రూపవతీ ! చెప్పుము 'చెప్పుము, విశేషము లేమయినఁ గలవా ? ఆయువతి నాకు లభించునో, లభింపదో యన్న విచారము చే శుష్క కాష్ఠమువలె నెండిపోయిన నా హృదయమున కమృత బిందువువంటివార్త యేదయినను గలదా ! చెప్పుము' అని యత్యాసక్తి తో నడిగెను

. “ రాజకుమారా ! నీ పుణ్యము పుచ్చినది. నీకోర్కెయీ డేఱినది. సార్వభౌముఁ డనఁదగుభీమ దేవుని నిరసించిన ఇచ్చిని నీదయను గోరుచున్నది. ఇఁకఁ గావలసిన దేమి ! అదృష్టవంతుఁ డవన్న నీవే యదృష్టవంతుఁడవు తెమ్ము, ఏదీ! ! నాకి చ్చెడిబహుమానము తెమ్ము' అని యామె యతని నడి గెను. ‘బహుమానమున కేమి ? ఇదివర కే నీ కది ముడుపు గట్టియున్నాను. ఆమే నన్ను వరించుట కిష్టపడినదా ! ముందామాట చెప్పుము' అని యభయ సిం గా మెను జూచుచుఁ బలికెను.