పుట:Ecchini-Kumari1919.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

ఇచ్చనీ కు మా రీ


కుమా !' అని పల్క నభయసింగు తన్నుఁ గృతార్థునిగా దలంచుచు నింటికి వెడలిపోయెను.

ఆహా ! లోకములో నెంత లేసిమాయావు లున్నారు ! ఈరూపవతి యిచ్ఛినీకుమారి యెదుట నేఁడు తప్ప నభయ సింగును వేఱొ కప్పుడు స్మరించిన పాపమునఁ బో లేదు. అభయ సింగుని యభిలాష మైనను నామె కెప్పుడును దెలుప లేదు. ఇట్లుండ నతని శార్యము నెఱ వేటినట్లే మాటాడి యభయ సింగును మోసపుచ్చి యది ధసము లాగుచున్నది. ఇచ్చినీ తనతోఁగూడి యచ లేశ్వరాలయమునకుఁ బోవ నుండుట చేఁ దనయం దామె కభిలాష యే లేని చోధన సాయము నడయుట కిష్ట పడ దని తలంచి యాయువతి తన్నుఁ బెండ్లా డుట నిశ్చయ మేయని యభయసిం గానాఁడే యామె కీయఁ - దలఁచిన బహుమాన మిచ్చి వేసెను.

రాత్రి జాముంర కావచ్చినది. అభయ సింగుచితము లగు వస్త్రాలంకారములు ధరించి ఖడ్గ పాణియై యిచ్ఛిని యంతఃపుర ద్వారమునొద్దకుఁ బోఁగా నక్కడ రూపవతి ప్రత్యక్ష మయ్యెను.వా రేదియా సంభాషించుచుండ నా రాకుమారి చక్కఁగా నలంక రించుకొని మేలిముసుఁగు వైచి కొని వచ్చి సవారిలోఁ గూర్చుండెను. బోయీలు సవారీ నెత్తుకొని నడవసాగిరి. రూపవతి సవారీకొక ప్రక్క నడచుచుండెను. అభయసింగు జాగరూకుఁ డై ఖడ్గ పాణియై యాసవారీని వెంట సంటి పోవుచుండెను. వారు కొలఁది కాలములో నే యచ లేశ్వ