పుట:Ecchini-Kumari1919.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

ఇచ్చనీకుమారి


రూప:: -- అమ్మా ! ఈయపాయమును నిముసములోమాయము చేయవచ్చును; నావిన్నప మాలకింపుము. భీమదేవుని బెండ్లాడుము, అతఁ డందమున నేమి, చందమున నేమి, సంపదలం దేమి, రాజ్య వైభవమం దేమి సుంతై నను గొఱఁతలేనివాఁడు; నేనెంత చెప్పినను నావచన మాలోచింపకున్నావు.తల్లీ ! వేఱాలోచనము మాని, భీముని వరించి ఘూర్జర రాజ్య మేలికొమ్ము. నీతండ్రిని, నీయాబూగడ రాజ్యమును సుఖపడనిమ్ము.

ఇచ్చి: – రూపవతీ ! నీవన్నది బాగుగా నున్నది. కానీ,యాభీమ రాజు నీకంటి కగ పడినట్లు నాకంటి కగపడ లేదు.అట్లయినఁ దప్పక యతని వరించియే యుందును. ఇక నా ప్రసంగము నాయొద్దఁ దేవద్దు. అతని పేరైనను వినుటకు నాకిష్టము లేదు,

రూప: పోనిమ్ము; ఆపదను దరించుట కుపాయముచెప్పితిని. అంతియ కొని వేఱు గాదు.

ఇచ్చి: – అంతకుఁదప్ప నాపదను దరింప నుపాయము లేదా?

రూప: ఏమున్నది

ఇచ్ఛి: – భీమ రాజును జయింపఁజాలిన యొక రాజేంద్రునిసాయ మపేక్షించిన నీయపాయము తొలఁగిపోదా ?

రూప: - అట్టివాఁ డెవ్వఁ డున్నాఁడు ?

ఇచ్ఛి: ఏమి, ఢిల్లీ శ్వరుఁడు లేడా ?

రూప: —చిఱునవ్వు నవ్వి యూరకుండును.