ప్రక ర ణ ము 12
61
-
ఇచ్చి. (కొంచెము కోపముతో) ఎందులకే యట్లు నవ్వుచున్నావు ?
రూప: లేదమ్మా ! ఊరకే నవ్వుచున్నాను.
ఇచ్చి:— కారణము చెప్పుదువా ? చెప్పవా ?
రూప: చెప్పిన నీకుఁ గోపము వచ్చు నేమో !
ఇచ్చి:— రాదు, చెప్పుము.
రూప: అమ్మా ! నీ వింత యమాయికురాల వేమి! తనతండ్రిని జంపిన భీమ దేవు నెదుర్కొన లేక పరాక్రమహీనుఁడై వర్తించిన పృథ్వీరా జెక్కడ ! నచ్చి మన చూపద తొలంగించు టెక్కడ ?
ఇచ్ఛి: — ఏమి ! ఢిల్లీశ్వరుఁడు పరాక్రమహీనత చేత నె భీము నెదుర్కొనలేఁ డందువా ?
రూప: వేఱు కారణ మేమి గలదు ?
ఇచ్చి: తగిన సమయము లభించునందాఁకఁ బగతుర నోర్చియుండుట రాజనీతిజ్ఞుల లక్షణము గదా !
రూప: రాజనీతిజ్ఞులలక్షణ మనుటకంటెఁ జేతకాని వానితనమనుట యుచిత మని \తోఁచుచున్నది,
ఇచ్చి:- తగిన సమాధానము చెప్ప లేక యారాజేంద్రుని నిందించుట యెందుకు ? ఇఁకమీఁద నాతని నిందించిన నే నంగీకరింసను.
రూప: లేదమ్మా కోపింపకుము, అతఁ డూరకుండుటచే నట్లను కొన్నాను.