పుట:Ecchini-Kumari1919.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రక రణ ము 9

45

కొంచెను. అజ్మీరు డిల్లీ రాజ్యములు గలసి యొక్కటియగుటచే నుత్తరహిందూస్థానమున నతఁడు మిగులఁ బ్రబలుఁడయ్యెను, రాజ్యము విస్తరించుట చేతను, సైన్య మెక్కుఁడగుట చేతను నతని నెదిరించుట కెట్టివారును జంకుచుండిరి. అప్పటివారలలో ప్రభలుడగు భీమ దేవుఁడు గూడఁ బృద్వీరాజు నెదిరించుటకు వెనుదీయుచుండక పోలేదు. మఱియుఁ దండ్రినిజంపినపగ దీర్చు కొనుటకుఁ బృద్వీరా జెప్పుడో తన పైకి దండెత్తి రాకమానఁ డని నిశ్చయించుకొని భీమ దేవుఁ డతి జాగరూశుఁడై యుండెను

పృద్వీరా జిదివఱ కే యిచ్ఛినీకుమారి గుణరూపములను విని యామెను వరింపఁదలఁచియుండెను. తన కాకుమారినిమ్మని యడిగిన జై తపరనూరుఁ డత్యాదరముతోఁ దనకోర్కి దీర్చు నని పృ్ద్వీరా జెఱుంగును. అయినను, రాజకుమారియనురాగ లత 'యెటు ప్రాకుచున్నదో తెలియకుండ నందులకై ప్రయ త్నించుట 'వ్యర్థమని యూరకుండెను. కాని, యాతఁ డామె వృత్తాంత మెప్పటికప్పు డరయుచుండక పోలేదు.

తొ మ్మి ద వ ప్రకరణ ము

సం భాష ణ ము

కాలవశమున ముదుసలియైన సూర్యుడు పడమటి కొండ శిఖరమునఁ దిరుగుచుఁ బ్రమాదవశమునఁ గాలు జాటి సము ద్రమునఁ బడి యదృశ్యుఁ డయ్యెను. తనప్రియునికి సంభవిం