పుట:Ecchini-Kumari1919.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

ఇచ్చినీకుమారి


టేనుఁ గొక కొలినిలో విహరించుచుండ నేనును నాతమ్ముఁ డుగు నీయరిసింగును గలసి దాసిని జంపితిమి. మే మొనర్చిన యాఅయుపకారమున కారాజు మిగులం గుపితుఁడై మ మ్మా కొండలందు గూడ నుండనీ రాదని నిశ్చయించుకొని సైన్య ములవచ్చి మమ్ముఁ దరిమిమి వేసెను. మాజనకుఁడు పర లోకగతు డయ్యెను. చేయునది లేక మే మేడ్వురమును మహా రాజు నెవ్వని నేసి యాశ్రయించి జీవింపఁదలంచి నీవు మహావీరుఁడవనియు, మంచివాడవనియు విని నీ చెంతకు వచ్చి నారము . మాకొలువు నంగీక రింపుము. సమయము వచ్చినపుడు మాప్రతా పొదులను గనుఁగొనుము' అని పలికి తన స్థానమునఁ కూర్చుండెను.

పృద్వీరాజు మంత్రులతో నాలోచించి వారిని జూచి 'రాజపుత్రులారా ! చాళుక్యవంశ సంభవుఁడగు భీమ దేవున కను, మాకును విరోధము ప్రబలుచున్నది. పుట్టుకచే శత్రు కోటిలోనివారగు మీకాశ్రయ మిచ్చుట రాజనీతికి విరుద్ధము ' 'అయినను మీరు, భీమ దేవునితో బద్ధశత్రుత్వ మవలంబించి యున్నారని యిదినుకే చారులవలన వినియున్నాము. మీ మాటలయం దసత్య నుమియు లేదు. కావున, మీ కాశ్రయ మిచ్చితిమి. మీరు సుఖముగా మాపురమున నుండి మా గౌరవ మందుచుండుఁ డని పల్కి వారిఁ జేరఁదీ సెను.

ఆకాలమునఁ బృద్వీ రాజు ధైర్యసాహములచేతను, సద్గుణములచేతను, దేశాభిమానము చేతను మిక్కిలి ప్రసిద్ధి ధి