పుట:Ecchini-Kumari1919.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

ఇచ్చినీకుమారి

చిన యాపద దెలిసికొని పడమటిదిశ చేయుచున్న రోదన ద్వవ నులన లె దమతమ కులాయములకుఁబోవు పక్షుల నినాదము లంతటను వ్యాపించెను. పతివి యోగమున కోర్వలేక యేడ్చుట చేత నే కాబోలు బడమటి దిశముఖ మెర్ర వారి యుండెను. దుఃఖ వినశురాలగు నాదిశా కాంత వీడ్వడిన తల వెండ్రుకలో యనం జీకట్లు వ్యాపించెను. ఆమె నోదార్చుటకై- వచ్చుచున్న బంధుజనులవలె జుక్క లొక్కొకటి చొప్పున కానవచ్చు. చుండెను. ప్రజలు తమతమ కార్యములనుండి మరలి సాయం కాలపుఁజల్లగాలుల ననుభవించు చుండిరి. ప్రదోషసమయు మగుట చే శిష్టజనులు కాలు సేతులు గడిగికొని సంధ్యావంద నాదులు చేయుచుండిరి. " దేవాలయములందు ఘంటాధ్వనులు వినవచ్చుచుండెను.

అట్టిత ఱి నచలేశ్వరాలయము భక్త జనులతో నిండి పోయెను. కొందఱు దేవిని నుతించుచుండిరి. కొందఱు శంకరు నకుఁ బ్రియతమమగుబూది నొంటినిండఁ బూసికొనుచుండిరి. కొండఱు భక్తి చే నిమీలిత నేత్రులయి ధ్యానించుచుండిరి, కొంద రీశ్వర ప్రసాదమును స్వీకరించి పైకి నచ్చి యగ్ని కుం డము తీరమునఁ గూర్చుండి మాటాడుకొనుచుండిరి. కొంత సేపటికి వచ్చిన వారందరను స్వామి నారాధించుకొని వెడలి పోయిరి. అర్చకులుగూడ దేవాలయపు తలుపులు బంధించి తమయిండ్ల కరిగిరి. అట్లండురును వెడలిపోయినను నొక యువ తియు, నొక పురుషుడును మాత్ర మచ్చటినుండి కదలకుండిరి.