ప్రక రణ ము 8
43
కొనివ చ్చెను. వారి శర్రీరములు మిగుల దీర్ఘ ములుగా నుండెను. వారిబాహు డండములు ఒలిసి యేనుఁగుతుండముల ననుకరించు నుండెను. వారిచూపులు మిక్కిలి ధీరము లై యుండెను. పెక్కేల ! వారియాకార ములు చూచినచో వారు మహా వీరులన్న బుద్ధి పొడమకపోదు. ఆవీరు లల్లంతదూరమునుం డియే వినయముతో రాజునకు నమస్కరించిరి. అంతఁ బృ్ద్వీ రాజు వారి నెదుర్కొనివచ్చి యాసనములఁ గూర్చుండ నియ మించి యాదరించెను. రాజు చేసిన గౌరవమునకు వారు మిగుల నానందించిరి. వారిలోఁ బెద్దవాఁడను ప్రతాపసింగు లేచి రాజసన్నిధిని నిలువఁబడి యెల్లరు విన నిట్లు పల్కెను.
'ఓమహారాజా ! మావృత్తాంతము యథార్థముగాఁ జెప్పుచున్నాను, అవధరింపుఁడు, మా కాపురము ఘూర్జర దేశము. మేము చాళుక్యవంశమునఁ బొడమిన వారము. ఇప్పుడు గుజ రాతును బాలించుచున్న భీమ దేవునికి జ్ఞాతులము, మా జనకుని పేరు సారంగ దేవుఁడు. భీమరాజు గర్వము చే గన్ను గానక మమ్మును, మాతండ్రిని దిరస్కరించి తన రాజ్యమునుండి తఱిమి వేసెను. మేము చేయునది లేక మా జనకునితోగూడ కొండల కేగి యచ్చట నే కాపురముండి మాకిట్టియిడుమలు గల్గించిన భీమ దేవునకుఁ దగిన ప్రతీకారము చేయవలెనని నిశ్చయించి కొంటిమి. మే మతని రాజ్యములోని గ్రామములఁ గొల్లఁగొట్టి యింతవఱకును జీవించుచుంటిమి. కొన్ని దినములకిందట నాభీమునకుఁ బ్రాణపదమైన పట్టపు