పుట:Ecchini-Kumari1919.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

ఇచ్చినీ కు మారి


పోయెను. ఆనందపాలుడు సో మేశ్వరుని తో డ్పాటునకు సంత సించి తనకూ తులలో : బెద్దదానిని గమలా డేవి నతని కిచ్చి వివాహము చేసి తన బహుమతు లొసంగి పంపి వేసెను, సోమేశ్వరునకు గమలా దేవియుము. స్వరా జుదయించెను,

ఆతి వృద్దుడగు ననంగ పాలుడు తన 'దౌహిత్రుఁడగు వృద్వీరాజును రాజ్యమున సభషిక్తునిఁ గావించి రాజర్షి యై బదరికాననమునకుఁ బోయెను. తండ్రియగు సోమేశ్వరుఁ డజ మీరును బాలించుచుండఁగాఁ బృద్వీరాజుడిల్లీ పురము నేలు చుండెను. ఇట్లుండ గుజరాతును బాలించు బీమ డవుఁ డజ మీరు రాజ్యము పై దాడి వెడలి సోమేశ్వరునితోఁ బోరు సల్పెను. సోమేశ్వరుఁడును నతనితో ఘోరముగాఁ బోరి వీర మరణమునందెను. పృద్వీవరాజది విని తండ్రి మరణమునకు విచారించి యుత్తరక్రియలు గావించి యజమీరు రాజ్యమును డిల్లీతోఁగలపి పాలించుచు భీమ దేవుని జయించి తనతండ్రిని జంపిన పగను దీర్చుకొనవలె నని నిశ్చయించి తగిన సైన్య మును గూర్చుకొని సమయమున 'కేదురు చూచుచుండెను. ఢిల్లీశ్వరుఁ డొక నాఁడు కొలువు దీర్చియుండెను. సింగపుఁ గొడమలవంటి రాజకుమారు లతని బరి వేష్టించి యుండిరి, చాందుభట్టను మహాకవి చోహనునంశజుల సద్గుణములను, ఖురాళమమును వర్ణించి సభ్యులను సంతసింపఁ జేసి యుథా, స్థానమునఁ గూర్చుండెను. అంతట ద్వార పాలకుఁడు రాజు ననుమతి చొప్పున నేడ్వురు రాజకుమారులను సభలోనికి వర్గం: