Jump to content

పుట:Ecchini-Kumari1919.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 8

41


వది. దానికి డిల్లీ యను పేరెప్పుడు వచ్చెనో మనము స్పష్ట ముగాఁ జెప్పలేము గాని హిందూ దేశముపై దాడి వెడలి వచ్చిన మహమ్మదీయులలో మొదటివాఁడగు గజనీ కాలము నకు పూర్వమందే యాపురమున కాపేరు గలుగుట మాత్రము నిజము. మిక్కిలి పాటుపడిన యింద్రప్రస్థమును దిల్లియుఁ డను "రాజు "బాగుచేయింప నతని పేరుననుసరించి యానగరమునకు ఢిల్లీ యను నామము గల్గినట్లు గొందఱుపండితులు చెప్పుదురు. ఆది యెంతవజకు నిజమో మనము చెప్పఁజాలము.

క్రీ. శ. 1750 న వత్సరమున, తూరువంజుం డగు ననంగపాలుడు ఢిల్లీపురమును బాలించుచుండెను. అతనికిఁ బురుష.సంతతి లేదు. ఇరువురు కూఁతులు మాత్రము గలరు. ఆ కాలమున రహతూరువంశజుఁడగుకాన్యాకుబ్జపురమును (క నౌజ) పరిపాలించుచుండెను. అతఁడు ఢిల్లీశ్వరునియశ క్తతను గనిపట్టి యతనిజయించి యారాజ్యము నాక్ర మించుకోన వలెనను తలంపుతో ఢిల్లి పై దాడి వెడలెను, అనంగ పాలుఁ డది విని మనస్సులో జంకియు,. లేనిపోని ధైర్యమును చెచ్చుకొని విజయపాలు నెదిరింప నిశ్చయించుకొనెను.

ఆ కాలమున చోహనవంశజుఁడగు నానంద దేవుకుమా రుఁడు సోమేశ్వరుఁ డజమీరు రాజ్య మేలుచుండెను. అతఁడు విజయపాలుని దాడినిగూర్చి విని సైన్యములతోఁ బోయి యనంగ పాలునకుఁ దోడయి విజయపాలు నెదిరించి పోరి జయముగాంచెను. విజయపాలుఁడు పరాజితుఁడై పారి