40
ఇచ్చినీ కు మారి
మృత్యు దేవత తాండవముసల్ప నున్నదనియు నతఁడు నిశ్చయింపకపోలేదు. అయిన, నతఁ డిప్పుడేమి చేయును ? తనకూఁతు నర్పింతునని భీమునకు వార్తపంపిన . వెనుకటి యపాయ మొక్క క్షణములోనే మాయమగును. కాని, పౌరుషవంతుఁడును, క్షత్రియవంశసంభవుఁడును నగుపరమా రుఁడు తనకు సంపూర్ణ నాశనము రానున్నను నట్టినీచకృత్య మున కిష్టపడునా ? కులక్రమాగతమగు నాబూగడ రాజ్య తనతరమున శతగతమయిన నగుగాక ! పుత్ర మిత్రస మేతుఁడై సైన్యముతో గూడ యుద్ధరంగమునఁ బ్రాణము లర్పింపవలసిన సమయము సంభవించిన సంభవించుఁ గాక ! గుణరూపసంపదలచే రెండవ లక్ష్మీ దేవివ లెనున్న తన కూతు నిచ్ఛినీకుమారిని జైనమ తానలంబి యగు భీమున కర్పించి పరమపవిత్రమగు తనహిందూ మతమునకుఁ గళం కము తెచ్చునా ? అట్లెన్నఁడును బరమారుఁడు చేయ లేఁడు, చేయఁడు.
ఎ నీ ని ద వ మ క ర ణ ము
పృథ్వీరాజు
ఉత్తర హిందూస్థానమునఁగల పురములలో ఢిల్లీ నగ కము తలమానికమువంటిది. అదియే పూర్వము ధర్మరాజు నకుఁ బ్రధాననగరమై యింద్రప్రస్థ మను పేరితో వాసిఁ గాంచి