పుట:Ecchini-Kumari1919.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము . 4

23


చెను. అతఁడు సంతానహీనుఁ డగుట చే నతని తరువాత నతని పినతండ్రియగు రెండన భీమ దేవుఁడు ఘూర్జరమునకు రా జయ్యెను. ఇతఁడు గుజరాతును బాలించిన చాళుక్యవంశజు అందజుఱు లోను మిక్కిలి ప్రసిద్ధిగాం చెను. ఇతనినే భోలా భీముఁ డని కూడఁ బిలుచుచుందురు,

ఆ యి ద వ ప్రకరణ ము

భీమ దేవుఁడు

అన్దిలపురమును బాలించిన కుమార పాలునికి మహీ పొలుఁ డను తమ్ముఁడు గలఁడు. అతనికి జయపాలుఁడు, భీమ దేవుఁడు నను నిరువురు కుమారు లుండిరి. వారిలోఁ బెద్దవాడగు జయపాలుఁడు రాజయ్యెను. అతనికి నాయకీ దేవియం దొక కుమారుఁ డుదయించెను. అతఁడు రెండవ మూలరా జను పేరుతో నంహిలమును బాలిం చెను. అతఁ డసం తాను డగుట చేతను, దుర్బలుఁ డగుట చేతను, నతని పినతండ్రి యగు భీమ దేవుఁడు వది నె గారియనుమతి చొప్పున రాజకీయ వ్యవ హారములందును, యుద్ధములందును మూలరాజునకు సాయ మొనర్చుచుఁ గ్రమముగా నధి కారమంతయుఁ దానే వహించి మూల రాజు నొక మూలకుఁ దోచి యన్షిలమును స్వతం ఈముగా నేలఁజొచ్చెను. అతఁడు పరాక్రమవంతుఁడును, మాట చెల్లు బడిగలవాఁడు నగుట చే నతఁడు చేసిన యీయన్యా