పుట:Ecchini-Kumari1919.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

ఇచ్చి నీ కు మారి



యమును దిద్దక పోవుట యే. కాక మంత్రులును, సానుంతు లును, బ్రజలును నతని ప్రభుత్వమున కంగీకరించిరి. భీమ దేవునిపరాక్రమము సాధారణమైనది కాదు. అతని పట్టుదలయు సామాన్యమైనది కాదు. అతఁ డారంభిం చిన పనులు తుద ముట్టువజకు మిక్కిలి దీక్షతోఁ జేయును, అతనియధికారము నిరాటంకముగా సాగుచుండెడిది. అతని ప్రభావము కొనియాడఁదగినది. ఒకప్పుడు మాళవ రాజయిన సహ దేవుడు తన పై దండెత్తిరాఁగా నది విని భీమ దేవుఁ డతని కిట్లు వార్తపంపెను. “ఓ రాజా ! నీవు సూర్యవంశజుఁ డవు. మీవంశకర్తయగు సూర్యునివలె మీరును దూర్పు దిక్కున మాత్రమె ప్రకాశింతురు. పడమట " నట్లు ప్రకాశం చుట పొసఁగదు. తుదకు నాశమే సంభవించును.” భయపఱుచుచు నిట్లు పంపిన వా ర్తకు మాళవ రాజును, నతనికుమాకుడర్జున దేవును మిగుల క్రుద్ధులై భీమ దేవుని రాజ్యమును ధ్వంసము చేయనారంభించిరి. భీమ దేవుం డందు లకు మిక్కిలి కినిసి సైన్యసమేతుఁడై పోయి వారలను జయించి తమి వేసెను.

ఒకప్పుడు భీమ దేవుని ప్రఖ్యాతి విని శహబుద్దీనుఘోరీ సముద్రమువంటి మహా సై న్యమును వెంటఁ బెట్టుకొని భీముని జయించి గుజరాతును నోట వేసికొనవలె నని యువ్విళ్ళూ రుచు వచ్చి యుద్ధమునకుఁ దలప డెను. అందులకు భీముం డిం తేనియుఁ జంకక చతురంగబలములను గూర్చుకొని