పుట:Ecchini-Kumari1919.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

ఇచ్చినీ కుమారి



దేవిని' బెండ్లియాడి యా మెయందు సిద్ధిరా జనుకుమారునిఁ గనియెను. అతఃడే తండ్రియనంతరము ఘూర్జర దేశమునకు జయ్యెను, అతఁడు మిగుల బలశాలి, శూరుఁడు. అతఁడు తన పై దండెత్తి వచ్చిన మాలవ దేశ రాజగుయశోవర్మ నోడిం చెను. మఱియు సూరతు పైకిఁ బలుసారులు దాడి వెడలి దాని జయించి తన రాజ్యమునఁ గలుపుకొనెను. అతనికి సం తానము లేనందున త్రిభువనపాలుని కుమారుఁడగు కుమార పాలుఁడు గుజరాతునకుఁ బ్రభు పయ్యెను. ఆత్రి భువన పాలుఁడు పెఱ వాఁడు కాఁడు. అనిలపురమును బాలించిన భీమ దేవునకు నకుళా దేవియనెడి వేటొక భార్యయందుఁ గల్గిన క్షేమ రాజు నకు మనుమఁడు. కుమార పాలుఁడు కీ. శ. 1148 వ వత్సర మున ఘూర్జర సింహాసన మెక్కి 1174 వ యేఁటివఱకును నిరం కుశముగాఁ బాలించి కీర్తి (గాంచెను. అతఁడు మిగుల యుద్ధ ప్రియుఁడు. పెక్కండ్రతో యుద్ధము చేసి జయలక్ష్మిని వరిం చెను. అతఁ డొనర్చిన యుద్ధము లన్ని టిలోను గొంకణ దేశాధి పతియగు మల్లికార్జునునితోఁ జేసినది మిగుల భయంకరమైనది. కుమార పాలునకు సంతతి లేదు. "కాని, కీర్తి పాలుఁడు మహీ పాలుఁడు నను నిరువును సోదరులు గలరు. వారిలో మహీ పాలుని కుమారుఁడగు జయపాలుఁడు కుమారపాలున నంతర మున నని లపుర రాజ్యమున కధీశుఁ డయ్యెను. అతఁ డొన ర్చినమన కార్యము లేమియును లేవు. అతనియనంతరమునం. దత్కుమారుఁడు రెండవ మూల రాజు గుజరాతును బాలిం