పుట:Ecchini-Kumari1919.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 3

15


రూ. ఉండెడివి. కాని యవియన్నియు నమ్మం బడినవి.

ఇచ్ఛి——అతనిఁ గూర్చి నీ కేమయినను దెలియునా ?

రూ. తెలియ కేమి! కొంతకాలము క్రిందటనే చాళుక్య భీమ దేవునకును, బృథ్వీరాజుజనకుఁడగు సోమేశ్వరుసకును ఘోరయుద్ధము సంభవించెను. అందు భీముఁడు సోమేశ్వరుని జయించి విఖ్యా ----------------

ఇచ్చి- యునతీ ! ఆ వృత్త మెందులకు ? దానివలన భీమ దేవుఁడు సర్వాధికుఁ డని స్థాపింపఁ బూనుచుంటివా ! ఈ మాజు భీమునియందు నీకుఁగల పక్షపాతము వెల్లడి యగు చున్నది. అంతమాత్రముచే నాతనికి వచ్చి నమహత్త్వ మేమి ? తదితరులకుఁ గల్గిన నీచత యేమి ? పృథ్వీ రాజవృత్తము ననవసర వృత్తాంతము తెచ్చి మాటాడెదవేల?


రూ: అమ్మా! క్షమింపుము, నాయు ద్దేశ మది కాదు. పృథ్వీరాజుతండ్రి ని గూడ నెఱుఁగుదు నని చెప్పుటకు నా వృత్తమును ద్రవ్వితిని. అంతకుఁ దప్ప వేఱులేదు, పృథ్వీ రాజుగూడ మహత్తరుఁ డనియె వినుచున్నాను.


ఇచ్చి: ఇంకను బక్షపాతబుద్ధిని వదలకున్నావు. భీముని పృథ్వీరాజుతో సమానునిగాఁ జేయ సెంచుచున్నావు? పోనిమ్ము, పృథ్వీరాజు ప్రతిమను వ్రాయఁగలనా ?