పుట:Ecchini-Kumari1919.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇచ్ఛి నీ కుమారి

రూ: -అమ్మా! చిత్రలేఖన మందు. నాకు మంచి నేర్పున్నది. సెలనయిన చో వ్రా సెదను.

ఇచ్చి. వ్రాయుము, తెప్పక వ్రాయుము. అందులకు: దగిన బహుమతి నీ కీయక పోను.

విని రూపనతి దూనందించుచుఁ దన పెట్టెలో నున్న రంగులను, కుంచిక లను దీసి యొక ప్రతిమను వాసి యామెకుఁ జూపెను. ఇచ్చిని దానిని బరిశీలించి (మందహాసము చేయుచు) “ఓయువతీ ! భీమ దేవుని చిత్రము వ్రాయుట యందుఁ జూసినంతచాతుర్యము నీ చేయి వేఱొక చిత్ర రచన యందుఁ జూపలేదని తలం చెదను.

రూ: ఏమమ్మా ! అట్లనుచున్నారు.

ఇచ్ఛి: — ఏమియును లేదు. అపృద్వీరాజు పోల్కి సరిగా నిందు లేదు. మఱియు రచనకూడ సంత యందముగా లేదు. నీవు వ్రాయఁగలిగియు దీనినిఁ బాడు చేసితి వేమో యని నా యనుమానము.

రూ: -అమ్మా! మీ రట్లనుట ధర్మమా ! నాచాతుర్య మును జూపి మాయనుగ్రహమును సంపాదించుకొని బ్రదుక న లెనని యున్న దాన నిట్లు చేయుదునా ! పృథ్వీరాజు నాకా రము సరిగా మనస్సునకుఁ బట్టక పోవుటచే నట్లు వ్రాసితిని. అంతియ కాని వేఱుగాదు.


ఇచ్ఛి: ——పోనిమ్ము !, పృథ్వీరాజు ప్రతిమ నాయొద్ద నున్నది. దానిఁ జూచి సరిగా వ్రాయుదువా ?