పుట:Ecchini-Kumari1919.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ఇ చ్ఛి నీ కు మా రి.


జూచుచుండిరి. తన పెట్టె నచ్చట దింపెను. తోడ నే చెలికత్తెలందఱు నా యునతిని జుట్టుముట్టి యాచిత్రములను ఇచ్ఛినీకుమారి కొన్ని పటములు చూచి దానితోఁ బ్రస్తుతము భూపాలనముఁ జేయుచున్న రాజులపటములు లేవా?' అని ప్రశ్నించెను.

రూపనతి 'అమ్మా! లేకేమి, ఉన్నవి' అని కొన్ని పటములుదీసి యామె చేతి కిచ్చెను. ఆ రాజకుమారి వాని నెల్లం బరిశీలించెను. వానిలో నొకటి దానికిఁ జూపి 'యువతీ! ఈపట మెవ్వరిది' అని యడి గెను. రూ—అమ్మా ! సకలరాజకులాలం కారుఁ డై, శత్రు భయంకరుఁడై , మహామహుఁడై ఘూర్జర దేశమును బాలించు చున్న చాళుక్య భీమ దేవునిపట మిది.

ఇచ్ఛి– భీమ దేవుఁ డితఁడా ! ఇతని రూపమునకును, బేరునకును మిక్కిలి తగియున్నది. కాని, యువతీ ! ఇతని నంతగాఁ బొగడుచున్నావు ? ఇట్లు పొగడుమని యారాజు నీ కేమయిన నిచ్చెనా యేమి ?

రూ—అమ్మా ! ఇచ్చెడి దేమి ? మహామహు లంద ఱకును బొగడఁదగినవారే కదా ? నే నతని గుఱించి చెప్పినది వాస్త వకథనమే కాని యతిశయోక్తి యేమియును లేదు. ఇచ్ఛి అతిశయోక్తి యేమియును లేదా ? పోనిమ్ము, దాని కేమి ! కాని, పృథ్వీరాజు చిత్రపట మున్నదా ?