పుట:Ecchini-Kumari1919.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 30

177


మైనను జేయుదురని నాకుఁగూఢ నమ్మకముండుటచే నాద్రో హుల నెట్లయిన నీదినమున నంతమునొందింపవ లెనని నిశ్చ యించి నీ కారహస్యమును జెప్పిన మామాటలు నమ్మ వని తలంచి మాయోపాయము చే నిన్ను నాకుటీరమునకుఁ గొని పోయితిని. అటనుండి నేను, మఱియొక రాజకుమారుఁడును నచ్చి నీ గుడారమున నుండఁగా రాత్రి రెండు యామములు ముగిసిన పిమ్మట నాచాళుక్యులలో నొకఁడు వచ్చి లోనికి బ వేశింప నీరంద్రమును జేసి యిందుండి వచ్చుచుండ మే మిరువురమును వానిని ఖండించితిమి. అట్లే కాచి కొనియుండి యీద్రోహుల నందఱును దెగటార్చితిమి. తరువాత మఱి యెవ్వరును రాక పోవుటచే నారాజకుమారుఁ డెవ్వరైన ద్రోహులు పైనున్నా రేమో చూచివచ్చెద సని చెప్పి పోయి యీ కుట్రకంతకుఁ గారణుఁ డగు నమర సింహునిఁ జంపి వచ్చెను. పిమ్మట మే మిరువురమును గలసి నీ చెంతకు వచ్చి తిమి. "కాని, నీవప్పటికి నిద్రించుచుంటివి. నీకు నిద్రాభం గముఁ గల్గింప నిష్టము లేక మేము మఱియొక స్థలమునకుఁ బోయి రాత్రి శేషమును బుచ్చితిమి. నిన్నటి దినమున నా రాజు కుమారుఁడు వచ్చి నన్ను ప్రోత్సహించి నాకు సాయపడక పోయినచోఁ జెప్పవలను పడని యంతఘోరకృత్యము నీగుడార మున సంభవించియుండునని చెప్పి యతని గుడారము లోనికిఁ దీసి కొనిపోయి రాత్రియం దాదుర్మార్గులు చేసిన పనిని జూ పెను.

పృథ్వీరా జది విని యత్యాశ్చర్యము నొందెను, తక్కినసభ్యులు నావృత్తాంతము విని చిత్తర్వుల వ లెనుండిరి. అప్పుడు రాజు 'నీకుఁ దోడ్పడిన రాజకుమారుఁ డెవఁ డని ప్రశ్నించెను.